AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాక్సిన్ రేసులో మరో మూడు దేశాలు

మానవాళికి పెనుముప్పుగా మారిన కరోనా వైరస్ బెడదను నిర్మూలించే వాక్సిన్ రూపకల్పనలో మన దేశం ముందుందని మనమంతా భావిస్తున్నాం. ఆగస్టు 15వ తేదీ కల్లా వాక్సిన్‌ను రూపొందించి...

వాక్సిన్ రేసులో మరో మూడు దేశాలు
Rajesh Sharma
|

Updated on: Jul 11, 2020 | 5:19 PM

Share

మానవాళికి పెనుముప్పుగా మారిన కరోనా వైరస్ బెడదను నిర్మూలించే వాక్సిన్ రూపకల్పనలో మన దేశం ముందుందని మనమంతా భావిస్తున్నాం. ఆగస్టు 15వ తేదీ కల్లా వాక్సిన్‌ను రూపొందించి, విడుదల చేసేందుకు హైదరాబాద్ నగరానికి చెందిన భారత్ బయోటెక్ సంస్థ శరవేగంతో పనిచేస్తున్నట్లు ఓ వైపు కథనాలు వస్తుండగా.. వేగంగా వాక్సిన్ తేవడం సాధ్యం కాదని వాదిస్తున్న వారూ లేకపోలేదు. ఈ క్రమంలో అసలు వాక్సిన్ రేసులో మన దేశమే ముందుందా ? లేక మరే దేశమైనా వాక్సిన్‌ను కనుగొనే క్రమంలో దూసుకుపోతుందా అన్న చర్చ మొదలైంది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తాజా గణాంకాల ప్రకారం కోటి 25 లక్షల మందికి కరోనా వైరస్ సోకగా.. అందులో సుమారు 72 లక్షల మంది వైరస్ బారిన పడి కోలుకున్నారు. అయిదున్నర లక్షల మందికిపైగా మృత్యువాత పడ్డారు. అయితే కరోనా వైరస్ ప్రభావం ప్రారంభం అయిన నాటి నుంచి పలు దేశాలకు చెందిన సైంటిస్టులు వాక్సిన్‌ను కనుగొనేందుకు యధాశక్తి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 150 కరోనా వ్యాక్సిన్లు ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్నట్లు సమాచారం. వాటిలో ఇంగ్లాండ్ ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ తయారు చేస్తోన్న వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ తుది దశకు చేరుకోగా.. అమెరికాకు చెందిన గిలియాడ్‌ సైన్సెన్‌, మాడెర్నా అనే బయోటెక్ సంస్థలు కూడా తమ వాక్సిన్ రూపకల్పన క్లినికల్‌ ట్రయల్స్‌ కీలక దశకు చేరుకుందని చెబుతున్నాయి.

ఇంకో వైపు జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్‌ సే కంపెనీ తాము రూపొందించిన వ్యాక్సిన్‌ ఈ సంవత్సరాంతానికి ఆమోదం పొందే అవకాశం వుందని చెబుతోంది. తాము తయారు చేసిన BNT162B1 అనే వ్యాక్సిన్‌ ప్రస్తుతం ప్రాథమిక దశలో చక్కని ఫలితాలనిచ్చిందని, దాదాపు 30 వేల మందిపై ట్రయల్స్‌ నిర్వహించిన తర్వాత పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకువచ్చే యోచనలో ఉన్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ అనుమతులకోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపింది.

సో.. ప్రస్తుతం మన దేశంతోపాటు ఇంగ్లాండ్, అమెరికా, జర్మనీ దేశాలు వాక్సిన్ రూపకల్పన రేసులో ముందంజలో కనిపిస్తున్నాయి. కాగా.. వైరస్ తొలిసారిగా కనిపించిన చైనా దేశంలో ఆల్ రెడీ వాక్సిన్‌ను కనుగొన్నారన్న ఊహాగానాలు కూడా లేకపోలేదు.