AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Virus: ఈ 5 క్రిటికల్ కోవిడ్ లక్షణాలు ఉన్నాయా .. ఆయితే వెంటనే డాక్టర్ ను సంప్రదించాల్సిందే..

Corona Virus: దేశంలో కరోనా విజృంభిస్తోంది. సెకండ్‌ వేవ్ లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. కొత్త కరోనా వేరియంట్లు అత్యంత ప్రమాదకర వైరస్‌లుగా..

Corona Virus:  ఈ 5 క్రిటికల్ కోవిడ్ లక్షణాలు ఉన్నాయా .. ఆయితే వెంటనే డాక్టర్ ను సంప్రదించాల్సిందే..
Corona Virus
Surya Kala
|

Updated on: Apr 20, 2021 | 6:13 PM

Share

Corona Virus: దేశంలో కరోనా విజృంభిస్తోంది. సెకండ్‌ వేవ్ లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. కొత్త కరోనా వేరియంట్లు అత్యంత ప్రమాదకర వైరస్‌లుగా రూపుదాల్చాయి. రోజురోజుకీ ఈ వైరస్ లోడ్ సంఖ్య ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. కోవిడ్ స్ట్రయిన్లు కేవలం అత్యంత ప్రాణాంతక వ్యాధులు మాత్రమే కాదు.. తీవ్రమైన కరోనా లక్షణాలు ఉంటాయి. అయితే వీటిలో అత్యంత ప్రమాదకర లక్షణలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా సోకినవారిని హోం క్వారంటైన్ లోనే ఉండాల్సిందిగా సూచిస్తున్నారు. అవసరమైతేనే ఆస్పత్రిలో చేరాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కరోనాలో ఏయే లక్షణాలు ప్రాణాంతకమైనవి? ఏ లక్షణాలు ఉంటే ఆస్పత్రిలో చేరాలనేది కూడా గుర్తించడం కష్టంగా మారింది. SARS-COV2 లక్షణాలు స్వల్పం నుంచి తీవ్రంగా మారే అవకాశం ఉంది. వైరస్ సోకిన మొదటి వారం ఎంతో కీలకం. ఈ సమయంలో కనిపించే లక్షణాలపై అవగాహన తప్పక ఉండాలి. లక్షణాల్లో ఏమైనా మార్పులు ఉన్నాయా? తీవ్ర లక్షణాలుగా మారాయా? లేదా అనేది గమనించాలి.

కరోనా తీవ్ర లక్షణాల్లో శ్వాస తీసుకోలేకపోవడం, ఛాతిలో నొప్పి వంటి తీవ్రమైన లక్షణాలుగా చెప్పవచ్చు. శరీరంలోని ఆరోగ్యకరమైన శ్వాసకోశ నాళాలపై కరోనావైరస్ దాడి చేస్తుంది. దాంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. పేషెంట్ కు తెలియకుండానే ఆక్సిజన్ స్థాయిలు ఆకస్మాత్తుగా పడిపోతాయి. హోం క్వారంటైన్ లో ఉండేవారంతా ఆక్సీమీటర్ ద్వారా ఎప్పటికప్పుడూ ఆక్సిజన్ స్థాయిలు చెక్ చేసుకుంటుండాలి. అలాగే మతిమరుపు లేదా కన్ఫూజన్ అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎందుకంటే.. కరోనా సోకిన వారిలో మెదడు, నాడీసంబంధిత వ్యవస్థపై ప్రభావం పడుతుంది. అలాగే ఛాతిలో ఎలాంటి తేలికపాటి నొప్పి వచ్చినా నిర్లక్ష్యంగా ఉండరాదు.

పెదాలు, ముఖంలోని పలు భాగాలు నీలం రంగులోకి మారిపోతాయి. ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో హైపోక్సియాకు దారితీస్తుంది. సరైన సమయంలో వైద్యసాయం అందకపోతే మరణం సంభవించవచ్చు.చాలామందిలో ఎక్కువగా కనిపించే సాధారణ వైరస్ లక్షణాల్లో జ్వరం, గొంతునొప్పి, ముక్కు కారడం, కండరాల నొప్పులు, కీళ్లనొప్పులు, వాసన, రుచి కోల్పోవడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీటిలో ఏ ఒక్కటి కనిపించినా వెంటనే అత్యవసర చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యమని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

Also Read: రోజూ గంటల తరబడి ఎక్సర్సైజ్ లు చేస్తున్నారా.. అయితే మీరు ప్రాబ్లెమ్ లో పడినట్లే..