ఏపీలో కరోనా విలయం.. ఆ జిల్లాలో లాక్‌డౌన్ పొడిగింపు.!
ఏపీలో కరోనా వైరస్ విలయం సృష్టిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నప్పటికీ వైరస్ నియంత్రణ కావట్లేదు. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
Coronavirus In Andhra Pradesh: ఏపీలో కరోనా వైరస్ విలయం సృష్టిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నప్పటికీ వైరస్ నియంత్రణ కావట్లేదు. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపధ్యంలో నెల్లూరు జిల్లాలో లాక్ డౌన్‌ను అధికారులు పొడిగించారు. గతంలో జూలై 31 వరకు లాక్ డౌన్ నిబంధనలు అమలులో ఉండగా.. కరోనా తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండటంతో ఆగష్టు 8 వరకు లాక్ డౌన్‌ను పొడిగిస్తూ అధికారులు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు రోడ్లపైకి రాకూడదని విజ్ఞప్తి చేశారు.
ఇక ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే నిత్యావసర దుకాణాలు తెరిచి ఉంటాయన్నారు. అలాగే లాక్‌డౌన్ సమయంలో మెడికల్ సర్వీసులకు, ఫుడ్ డోర్ డెలివరీలకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. అటు ప్రజలు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు.
Also Read:
ఆగష్టు 31 వరకు అంతర్జాతీయ విమానాలు రద్దు.