అన్‌లాక్‌ 3.0: ఏపీ వెళ్ళాలనుకుంటే.? ఈ పాస్ తప్పనిసరి..

ఏపీలోకి ఎంటర్ కావాలంటే ఖచ్చితంగా ఈ-పాస్ ఉండాలని అధికారులు వెల్లడించారు. నేటి నుంచి అన్‌లాక్‌ 3.0 అమలులోకి వస్తున్న నేపధ్యంలో నిబంధనలు లేకుండా...

అన్‌లాక్‌ 3.0: ఏపీ వెళ్ళాలనుకుంటే.? ఈ పాస్ తప్పనిసరి..

E-Pass Is Mandatory For AP Travel: అన్‌లాక్‌ 2.0 ముగిసింది. నేటి నుంచి అన్‌లాక్‌ 3.0 అమలులోకి వచ్చింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కంటైన్మెంట్ జోన్లలో ఆగష్టు 31 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందన్న కేంద్రం.. అంతర్రాష్ట్ర ప్రయాణాలు, గూడ్స్ రవాణాపై పూర్తిగా ఆంక్షలు తొలిగించింది.

అయితే ఏపీలోకి ఎంటర్ కావాలంటే ఖచ్చితంగా ఈ-పాస్ ఉండాలని అధికారులు వెల్లడించారు. నేటి నుంచి అన్‌లాక్‌ 3.0 అమలులోకి వస్తున్న నేపధ్యంలో నిబంధనలు లేకుండా వాహనాలను ఏపీలోకి అనుమతిస్తారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అలాంటి వదంతులు ప్రజలు నమ్మొద్దని జగ్గయ్యపేట సీఐ చంద్రశేఖర్ వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌లోకి అడుగు పెట్టాలంటే వాహనాలకు ఈ-పాస్ తప్పనిసరి అని క్లారిటీ ఇచ్చారు. ఇతర రాష్ట్రాల నుండి ఏపీలోకి ప్రవేశించే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అనుమతిస్తామని అన్నారు. కాగా, ఈ- పాస్ ఉన్న వాహనదారుల దగ్గర నుంచి ఆధార్ నెంబర్, చిరునామాను నమోదు చేసుకున్న తర్వాతే రాష్ట్రంలోకి అనుమతిస్తామని.. అనుమానం ఉన్నవారికి కోవిడ్ టెస్ట్ తప్పనిసరి సీఐ చంద్రశేఖర్ క్లారిటీ ఇచ్చారు.

Click on your DTH Provider to Add TV9 Telugu