మరుగుదొడ్డిలో మొసలి.. వణికిపోయిన ఇంటి యజమాని..!

అటవీ ప్రాంతాల్లో ఉండాల్సిన వన్యప్రాణులు జనవాసాల్లో ప్రత్యక్షమవుతున్నాయి. ఆ మధ్య ఢిల్లీలో బాత్ రూమ్‌లోకి కొండచిలువ వచ్చింది. పుట్టల్లో ఉండాల్సిన నాగుపాములు వంటింటి సింక్ లో దూరింది అనే వార్తలను మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. తాజాగా బాత్ రూమ్‌లోకి మొసలి వచ్చి చేరింది. ఇది చూసిన ఆ ఇంటి యజమాని గుండె గుబేల్‌మంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో ఈ ఘ‌ట‌న వెలుగు చూసింది.

ఫిరోజాబాద్ జిల్లాలోని మొహబ్బత్‌పూర్ గ్రామానికి చెందిన ఒక వ్య‌క్తి ఇంటి బయట ఉన్న మరుగుదొడ్డిలోకి మొసలి ప్రవేశించింది. ఉద‌యం మరుగుదొడ్డిలో మొస‌లిని చూసిన అతడు షాక్ గురై భయంతో కేక‌లు వేయడంతో ఇరుగుపొరుగు వారు పరిగెత్తుకొచ్చారు. మరుగుదొడ్డిలో 5 అడుగుల పొడవైన భారీ మొసలిని చూసి ఖంగుతిన్నారు స్థానికుల‌ు. వెంటనే ఆ మరుగుదొడ్డి తలుపులు మూసేసి అటవీ శాఖ అధికారులకు స‌మాచారమిచ్చారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది మొస‌లిని సురక్షితంగా బోనులో బంధించి తీసుకెళ్లిపోయారు. అక్కడి నుంచి తరలించిన మొసలిని సమీపంలోని య‌మునా న‌దిలో విడిచిపెట్టారు. మొసలిని తరలించడంతో గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, మొసలి అక్కడికి ఎలా వచ్చిందన్న దానిపై గ్రామస్తులు అశ్చర్చానికి గురయ్యారు.

Click on your DTH Provider to Add TV9 Telugu