కేటీఅర్ అన్నా.. మా ఊరికి పంపండి.. సోదరి విజ్ఞప్తి..

|

Mar 25, 2020 | 1:49 PM

దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో ప్రధానమంత్రి మూడు వారాల పాటు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కొంతమంది తమ సొంతూర్లకు వెళ్ళలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక ప్రకాశం జిల్లాకు చెందిన సుహాసిని అనే ఓ అమ్మాయి హైదరాబాద్‌లో ఉండిపోయింది. ఆమె కేటీఅర్ కు ట్వీట్ చేయగా.. తిరిగి పంపించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు...

కేటీఅర్ అన్నా.. మా ఊరికి పంపండి.. సోదరి విజ్ఞప్తి..
Follow us on

Coronavirus Effect: దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో ప్రధానమంత్రి మూడు వారాల పాటు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల క్రితం నుంచే లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. అత్యవసర సేవలు మినహాయించి.. మిగిలినవన్నీ కూడా బంద్ కావడంతో కొంతమంది తమ సొంతూర్లకు వెళ్ళలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లాకు చెందిన సుహాసిని అనే ఓ అమ్మాయి హైదరాబాద్‌లో ఉండిపోయింది.

‘ఉద్యోగం చూసుకోవడానికి హైదరాబాద్ వచ్చాను. ఎటూ వెళ్ళలేక ఇక్కడే ఇరుక్కుపోయాను. రెండు రోజుల నుంచి భోజనం కూడా లేక ఇబ్బంది పడుతున్నా.. అంతేకాకుండా హైదరాబాద్‌లో ఉండేందుకు నాకు ఎలాంటి ఆప్షన్ కూడా లేదు. నేను తిరిగి మా ఊరి వెళ్ళడానికి సాయం చేయండి’ అని మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేసింది. దీనికి మంత్రి స్పందించి.. తగిన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 39కి చేరగా.. ఆంధ్రప్రదేశ్‌లో 8కి చేరుకుంది.

For More News:

ఏపీలో మరో కరోనా కేసు…

కొత్తగూడెం పోలీస్ అధికారి, వంట మనిషికి కరోనా.. 39కి చేరిన కేసులు..

ఇండియా లాక్ డౌన్.. ఏ సేవలకు బ్రేక్.? ఏవి ఉంటాయి.?

‘ఇంటికి రావద్దు ప్లీజ్’.. కరోనా అనుమానితుల ఇళ్లకు రెడ్ నోటిసులు..

కరోనా మరణ మృదంగం.. ప్రపంచవ్యాప్తంగా 18 వేలు దాటిన మరణాలు..

దేశంలో మొట్టమొదటి కోవిడ్ 19 ఆసుపత్రి.. రిలయన్స్ సంచలనం..

జక్కన్న అదిరిపోయే ఉగాది ట్రీట్.. ‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ లోగో విడుదల..

ఈ లక్షణాలు ఉన్నా.. కరోనా వైరస్ సోకినట్లే..!

గుడ్ న్యూస్.. కరోనాలా హంటా వైరస్ కాదట… అసలు నిజమిదే.!