Coronavirus Effect: కరోనా వైరస్ కారణంగా పేదోడు నుంచి పెద్దోడు వరకు అందరూ కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. అటు దేశంలో మొత్తం లాక్ డౌన్ ప్రకటించినా.. ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు నిత్యావసర వస్తువులు, మెడిసిన్స్ కోసం ఆయా ప్రభుత్వాలు పర్మిషన్లు ఇచ్చాయి. ఈ క్రమంలోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన ఇంటికి సరుకులు కొనడానికి జూబ్లిహిల్స్ లోని రత్నదీప్ సూపర్ మార్కెట్ లో ప్రత్యక్షమయ్యారు. మొహానికి మాస్క్ వేసుకుని షార్ట్, టీ షర్ట్ తో ఉన్న బన్నీని కొందరు గుర్తుపట్టి ఫోటోలు తీశారు. ఇంకో ఆశ్చర్యం ఏంటంటే బన్నీ తన వెంట బాడీగార్డ్ ఎవరిని కూడా తీసుకురాలేదు. కాగా, కరోనా సెలబ్రిటీలు, సామాన్యులు ఒకటే అని చెప్పేసింది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
For More News:
కరోనా ఎఫెక్ట్.. దేశవ్యాప్తంగా టోల్ గేట్ ఫీజులు రద్దు..
కూరగాయలు, నిత్యావసర వస్తువుల రేట్లు ఫిక్స్.. ధరలు పెంచితే కేసులు తప్పవు..
సామాజిక దూరం పాటిస్తే.. ఇండియాలో కరోనా కేసులు 62 శాతం తగ్గుతాయట..!
కరోనా మృత్యుకేళి.. 22 వేలు దాటిన మరణాలు.. ఒక్కరోజే @748
హైదరాబాద్ హాస్టళ్లలో ఉండే ఉద్యోగులు, విద్యార్థులకు ఊరట…
Breaking.. కరోనా ఎఫెక్ట్.. ఏప్రిల్ 14 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు..
కరోనా అప్డేట్: దేశంలో 694 కేసులు, 16 మరణాలు..