కరోనా ఎఫెక్ట్.. దేశవ్యాప్తంగా టోల్ గేట్ ఫీజులు రద్దు..

COVID 19: కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో ప్రధాని మంత్రి నరేంద్రమోదీ ఇండియాలో లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. అత్యవసర వాహనాలు మినహాయించి ప్రజా రవాణా అంతా బంద్ అయింది. ఈ నేపధ్యంలో దేశవ్యాప్తంగా టోల్ గేట్ల ఫీజులు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలు ఏప్రిల్ 14 వరకు అమలులో ఉంటాయని ఉత్తర్వులలో పేర్కొంది. దేశంలో లాక్ డౌన్ […]

కరోనా ఎఫెక్ట్.. దేశవ్యాప్తంగా టోల్ గేట్ ఫీజులు రద్దు..
Follow us

|

Updated on: Mar 26, 2020 | 3:45 PM

COVID 19: కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో ప్రధాని మంత్రి నరేంద్రమోదీ ఇండియాలో లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. అత్యవసర వాహనాలు మినహాయించి ప్రజా రవాణా అంతా బంద్ అయింది. ఈ నేపధ్యంలో దేశవ్యాప్తంగా టోల్ గేట్ల ఫీజులు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలు ఏప్రిల్ 14 వరకు అమలులో ఉంటాయని ఉత్తర్వులలో పేర్కొంది. దేశంలో లాక్ డౌన్ ఉన్నన్ని రోజులు ఎలాంటి రుసుములు వసూలు చేయకుండా వాహనాలకు అనుమతులు ఇవ్వాలని తెలియజేసింది.

ఇప్పటికే పలు టోల్ గేట్లకు ఈ సూచనలు అందడంతో వాహనాలు ఆగకుండా ఉచితంగా తిరుగుతున్నాయి. అంతేకాకుండా టోల్ బూత్‌లలో ఉండే సిబ్బందిని సైతం ఇళ్లకు పంపించేశారని తెలుస్తోంది. రాష్ట్రాలు అన్ని లాక్ డౌన్ ప్రకటించడంతో టోల్ గేట్ల నుంచి వాహనాల రాకపోకలు గణనీయంగా తగ్గడం జరిగింది. పోలీస్ వాహనాలు, డాక్టర్లు, పాలు, కూరగాయలు, నిత్యావసర వస్తువుల వాహనాలే ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్తుండటంతో మోదీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా, దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు ఎన్ని తీసుకున్నా కూడా దాన్ని కట్టడి చేయలేకపోతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 681 పాజిటివ్ కేసులు ఉండగా.. ఈ వ్యాధి బారిన పడి 13 మంది మృత్యువాతపడ్డారు. ఇక శాస్త్రవేత్తలు కరోనాకు విరుగుడు కనిపెట్టేందుకు శతవిధాల ప్రయత్నాలు సాగిస్తున్నారు. అటు అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. అత్యవసర పరిస్థితులలో తప్పితే బయటికి రావద్దని ప్రజలను విజ్ఞప్తి చేశాయి.

For More News:

ఇండియా లాక్ డౌన్.. ఏ సేవలకు బ్రేక్.? ఏవి ఉంటాయి.?

‘ఇంటికి రావద్దు ప్లీజ్’.. కరోనా అనుమానితుల ఇళ్లకు రెడ్ నోటిసులు..

దేశంలో మొట్టమొదటి కోవిడ్ 19 ఆసుపత్రి.. రిలయన్స్ సంచలనం..

గుడ్ న్యూస్.. కరోనాలా హంటా వైరస్ కాదట… అసలు నిజమిదే.!