Breaking News
  • రోజురోజుకీ కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తమయ్యింది. గడచిన 24 గంటల్లోనే 438 మంది వైరస్‌ బారిన పడ్డారంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులకు పది ప్రాంతాలు డేంజర్‌ స్పాట్స్‌గా ఉన్నాయని కేంద్రం ప్రకటించింది.
  • అసలే జనం భయంతో బతికేస్తున్నారు. ఈ టైమ్‌లో కరోనాపై అవాకులు చవాకులు పేల్చేవాళ్లు ఎక్కువయ్యారు. కొందరు ఫేక్‌ న్యూస్‌ పోస్టు చేస్తుంటే కొందరు విధులు నిర్వర్తిస్తున్న పోలీసులపై, వైద్యులపై ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ మొత్తం రాష్ట్ర పరిస్థితిని ఆరా తీస్తున్నారు.
  • ఏలూరులో ఒక్కసారిగా ఎనిమిది కరోనా పాజిటివ్‌ కేసులు తెరమీదకు వచ్చాయి. ఇంకెన్ని ఉంటాయోనని ప్రజలు భయపడుతుంటే అలాంటి హై రిస్క్‌ జోన్‌లో నిరంతరం పని చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం సిటీలో 144 సెక్షన్‌ అమలవుతోంది. కుటుంబాలకు దూరంగా రెడ్‌జోన్‌లో పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు.
  • ప్రతీది కరోనా కాదు.. పొడిదగ్గు తుమ్ములు ఉంటే వాయుకాలుష్యం. దగ్గు, తెమడ, ముక్కు కారడం, తుమ్ములు వస్తే జలుబు. దగ్గు, తెమడ, తుమ్ములు, ముక్కు కారడం, ఒంటి నొప్పులు, బలహీనత, తేలికపాటి జ్వరం ఫ్లూ లక్షణాలు. పొడిదగ్గు, తుమ్ములు, ఒంటి నొప్పులు, అధిక జ్వరం, బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఇవన్నీ కొవిడ్‌-19 లక్షణాలు. ప్రతీది కరోనా కాదు.. కంగారు పడొద్దు..
  • నిజాముద్దీన్ మర్కజ్ కేసులో ఢిల్లీ క్రైం బ్రాంచ్ నోటీసులు. తబ్లీఘీ-జమాత్ చీఫ్ మౌలానా సాద్ సహా 7గురు నిందితులకు నోటీసులు. నిబంధనలు ఎందుకు అతిక్రమించారో రాతపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశం. నిందితుల ఇళ్లకు నోటీసులు పంపించిన క్రైం బ్రాంచ్.

కరోనా అప్డేట్: దేశంలో 694 కేసులు, 16 మరణాలు..

COVID 19, కరోనా అప్డేట్: దేశంలో 694 కేసులు, 16 మరణాలు..

COVID 19: కరోనా రాకాసి భారత్‌లో వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే దేశంలో 27 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ వైరస్ పాకింది. గురవారం నాటికి దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 694కి చేరుకుంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు మొత్తంగా 16 మంది మృత్యువాతపడ్డారు. మొత్తం బాధితుల్లో 45 మంది కోలుకున్నారు. ఇక మహరాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. అంతేకాకుండా మహారాష్ట్రలో అత్యధికంగా 124 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇకకేరళలో 118కేసులు ఉన్నాయి. కాగా, రాత్రి 8 గంటల వరకు దేశవ్యాప్తంగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి..

COVID 19, కరోనా అప్డేట్: దేశంలో 694 కేసులు, 16 మరణాలు..

 

ఈ మహమ్మారి కోవిడ్ 19ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాయి. ఇప్పటికే దేశమంతా లాక్ డౌన్ ప్రకటించగా.. ప్రజలు తమ ఇళ్లు దాటి బయటికి రావద్దని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేశాయి. అత్యవసర సేవలు మినహాయించి ప్రజా రవాణా మొత్తం ఏప్రిల్ 14 అర్ధరాత్రి వరకు బంద్ అయ్యాయి.

For More News:

దేశంలో మొట్టమొదటి కోవిడ్ 19 ఆసుపత్రి.. రిలయన్స్ సంచలనం..

గుడ్ న్యూస్.. కరోనాలా హంటా వైరస్ కాదట… అసలు నిజమిదే.!

కరోనా ఎఫెక్ట్.. దేశవ్యాప్తంగా టోల్ గేట్ ఫీజులు రద్దు..

కూరగాయలు, నిత్యావసర వస్తువుల రేట్లు ఫిక్స్.. ధరలు పెంచితే కేసులు తప్పవు..

సామాజిక దూరం పాటిస్తే.. ఇండియాలో కరోనా కేసులు 62 శాతం తగ్గుతాయట..!

కరోనా మృత్యుకేళి.. 22 వేలు దాటిన మరణాలు.. ఒక్కరోజే @748

హైదరాబాద్ హాస్టళ్లలో ఉండే ఉద్యోగులు, విద్యార్థులకు ఊరట…

Breaking.. కరోనా ఎఫెక్ట్.. ఏప్రిల్ 14 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు..

Related Tags