Breaking News
  • తెలంగాణలో మరో 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. తెలంగాణ లో ఇప్పటి వరకు 154 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. తెలంగాణలో కరోనా వైరస్ తో 9 మంది మృతి చెందారు.. ఈరోజు మరో ముగ్గురు ఆసుపత్రి నుండి డిచ్ఛార్జ్ అయ్యారు.. మొత్తం 17 మంది కోలుకున్నారు..
  • అసలే జనం భయంతో బతికేస్తున్నారు. ఈ టైమ్‌లో కరోనాపై అవాకులు చవాకులు పేల్చేవాళ్లు ఎక్కువయ్యారు. కొందరు ఫేక్‌ న్యూస్‌ పోస్టు చేస్తుంటే కొందరు విధులు నిర్వర్తిస్తున్న పోలీసులపై, వైద్యులపై ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ మొత్తం రాష్ట్ర పరిస్థితిని ఆరా తీస్తున్నారు.
  • ఏలూరులో ఒక్కసారిగా ఎనిమిది కరోనా పాజిటివ్‌ కేసులు తెరమీదకు వచ్చాయి. ఇంకెన్ని ఉంటాయోనని ప్రజలు భయపడుతుంటే అలాంటి హై రిస్క్‌ జోన్‌లో నిరంతరం పని చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం సిటీలో 144 సెక్షన్‌ అమలవుతోంది. కుటుంబాలకు దూరంగా రెడ్‌జోన్‌లో పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు.
  • ప్రతీది కరోనా కాదు.. పొడిదగ్గు తుమ్ములు ఉంటే వాయుకాలుష్యం. దగ్గు, తెమడ, ముక్కు కారడం, తుమ్ములు వస్తే జలుబు. దగ్గు, తెమడ, తుమ్ములు, ముక్కు కారడం, ఒంటి నొప్పులు, బలహీనత, తేలికపాటి జ్వరం ఫ్లూ లక్షణాలు. పొడిదగ్గు, తుమ్ములు, ఒంటి నొప్పులు, అధిక జ్వరం, బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఇవన్నీ కొవిడ్‌-19 లక్షణాలు. ప్రతీది కరోనా కాదు.. కంగారు పడొద్దు..
  • నిజాముద్దీన్ మర్కజ్ కేసులో ఢిల్లీ క్రైం బ్రాంచ్ నోటీసులు. తబ్లీఘీ-జమాత్ చీఫ్ మౌలానా సాద్ సహా 7గురు నిందితులకు నోటీసులు. నిబంధనలు ఎందుకు అతిక్రమించారో రాతపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశం. నిందితుల ఇళ్లకు నోటీసులు పంపించిన క్రైం బ్రాంచ్.

ఐపీఎల్: చెన్నై విజయాలకు.. బెంగళూరు ఓటములకు కారణమిదే..

IPL 2020, ఐపీఎల్: చెన్నై విజయాలకు.. బెంగళూరు ఓటములకు కారణమిదే..

IPL 2020: ఐపీఎల్‌లో బలమైన జట్లలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్కసారిగా కూడా ట్రోఫీని ముద్దాడలేకపోయింది. పేరుకు బలమైన జట్లైన.. గ్రౌండ్‌లోకి వచ్చిన ప్రతీసారి పేలవ ప్రదర్శన కనబరుస్తూ వచ్చింది. విరాట్ కోహ్లి, డివిలియర్స్ తప్పితే రాణించిన ఆటగాళ్లు ఎవరూ లేదు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని సారధ్యంలో మూడు సార్లు టైటిల్ విజేతగా నిలిచింది. జట్టులో చాలామంది సీనియర్ ప్లేయర్స్ ఉన్నా.. ధోని కెప్టెన్సీ జట్టుకు ప్రతీసారి కీలకంగా మారింది.

ఈ రెండు జట్ల విజయాల శాతాన్ని ఒకసారి పరిశీలిస్తే ఖచ్చితంగా ఆర్సీబీ కింద స్థానంలో ఉంటుంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ విజయాలను అందుకోలేకపోవడానికి సరైన బౌలింగ్ లేకపోవడమే కారణమని దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రావిడ్ వెల్లడించాడు. టిమ్‌ విగ్మోర్‌, ఫ్రెడ్డీ వైల్డ్‌ రచించిన పుస్తకంలో ద్రావిడ్ ఈ విధంగా పేర్కొన్నాడు.

‘ఐపీఎల్ ప్రారంభం నుంచి సీఎస్కే జట్టు ఎంతో అత్యుత్తమైన జట్టు. ఆ జట్టు యాజమాన్యం ఇంతకముందే క్రికెట్ జట్లను నడిపిన అనుభవం కూడా ఉంది. అంతేకాకుండా ధోని సారధ్యంలో మెరుగైన ఆటతీరును కనబరుస్తూ వచ్చింది. ఇక ఆర్సీబీ జట్టు కూడా చెన్నై లాగే బలమైన జట్టే కానీ సమతూకంగా ఉండేది కాదు. వేలం, జట్టు ఎంపిక విషయాల్లో ఆ ఫ్రాంచైజీ ఎప్పుడూ సరైన నిర్ణయాలు తీసుకోలేదు. ఒక్క మిచెల్ స్టార్క్ ఉన్న సీజన్లో మాత్రం ఉత్తమ ప్రదర్శన కనబరిచింది.

మరోవైపు ఆర్‌సీబీ ఎప్పుడూ అద్భుతమైన బ్యాట్స్‌మెన్‌ను వేలంలో ఎంపిక చేసుకుంటుంది. జట్టులో నాలుగు విదేశీ ఆటగాళ్ల స్థానాల కోసం ఎంతోమంది అంతర్జాతీయ మేటి ఆటగాళ్లు ప్రత్యామ్నాయంగా ఉంటారు. కానీ చెన్నై జట్టులో మాత్రం అందరూ కూడా భారత్ ప్లేయర్స్ ఉంటారు. అంతేకాకుండా ఉత్తమైన బౌలింగ్ లైనప్ ఉండటంతో విజయాలు ఈజీగా అందుకుంటోంది. ఆర్‌సీబీ మాత్రం గొప్ప బౌలర్‌ను తీసుకోవడంలో ఎప్పుడూ ప్రత్యేక దృష్టి పెట్టలేదు. కాగా, కరోనా వైరస్ నేపధ్యంలో ఐపీఎల్ 13వ సీజన్ ఏప్రిల్ 15కు వాయిదా పడిన సంగతి విదితమే.

For More News:

దేశంలో మొట్టమొదటి కోవిడ్ 19 ఆసుపత్రి.. రిలయన్స్ సంచలనం..

గుడ్ న్యూస్.. కరోనాలా హంటా వైరస్ కాదట… అసలు నిజమిదే.!

కరోనా ఎఫెక్ట్.. దేశవ్యాప్తంగా టోల్ గేట్ ఫీజులు రద్దు..

కూరగాయలు, నిత్యావసర వస్తువుల రేట్లు ఫిక్స్.. ధరలు పెంచితే కేసులు తప్పవు..

సామాజిక దూరం పాటిస్తే.. ఇండియాలో కరోనా కేసులు 62 శాతం తగ్గుతాయట..!

కరోనా మృత్యుకేళి.. 22 వేలు దాటిన మరణాలు.. ఒక్కరోజే @748

హైదరాబాద్ హాస్టళ్లలో ఉండే ఉద్యోగులు, విద్యార్థులకు ఊరట…

Breaking.. కరోనా ఎఫెక్ట్.. ఏప్రిల్ 14 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు..

కరోనా అప్డేట్: దేశంలో 694 కేసులు, 16 మరణాలు..

Related Tags