కూరగాయలు, నిత్యావసర వస్తువుల రేట్లు ఫిక్స్.. ధరలు పెంచితే కేసులు తప్పవు..

Coronavirus Effect: కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మూడు వారాల పాటు లాక్ డౌన్ ప్రకటించింది. అత్యవసర సేవలు తప్పితే అన్నీ కూడా బంద్ కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఈ సమయాన్ని క్యాష్ చేసుకుంటూ కొంతమంది వ్యాపారులు నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలను పెంచి అమ్ముతున్నారు. దీనితో తెలంగాణ ప్రభుత్వం వాటి ధరలను నిర్ణయించింది. ఒకవేళ ఎవరైనా కూడా ఆ ధరల కంటే అధికంగా అమ్మితే పీడి యాక్ట్ కింద […]

కూరగాయలు, నిత్యావసర వస్తువుల రేట్లు ఫిక్స్.. ధరలు పెంచితే కేసులు తప్పవు..
Follow us

|

Updated on: Mar 26, 2020 | 3:53 PM

Coronavirus Effect: కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మూడు వారాల పాటు లాక్ డౌన్ ప్రకటించింది. అత్యవసర సేవలు తప్పితే అన్నీ కూడా బంద్ కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఈ సమయాన్ని క్యాష్ చేసుకుంటూ కొంతమంది వ్యాపారులు నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలను పెంచి అమ్ముతున్నారు. దీనితో తెలంగాణ ప్రభుత్వం వాటి ధరలను నిర్ణయించింది. ఒకవేళ ఎవరైనా కూడా ఆ ధరల కంటే అధికంగా అమ్మితే పీడి యాక్ట్ కింద కేసులు పెట్టనుంది.

కూరగాయలు…

  • వంకాయ- రూ.30 కేజీ
  • బెండకాయ- రూ.40 కేజీ
  • టమాట- రూ.10 కేజీ
  • అరటికాయ- రూ.40 కేజీ
  • కాలిఫ్లవర్‌- రూ.40 కేజీ
  • క్యాబేజి- రూ.23 కేజీ
  • పచ్చిమిర్చి- రూ.60 కేజీ
  • చిక్కుడుకాయ- రూ.45 కేజీ
  • బీరకాయ- రూ.60 కేజీ
  • క్యారెట్‌- రూ.60 కేజీ
  • ఆలుగడ్డ- రూ.30 కేజీ
  • ఉల్లిపాయలు(తెల్లవి)- రూ.30 కేజీ
  • ఉల్లి(ఎర్రవి)- రూ.35 కేజీ
  • వెల్లుల్లి- రూ.160 కేజీ
  • అల్లం- రూ.220 కేజీ

ఆకు కూరల రేట్లు ఇలా ఉన్నాయి.. 

  • పాలకూర- కిలో రూ.40
  • తోటకూర- కిలో రూ.40
  • కొత్తిమీర- కిలో రూ.60
  • మెంతికూర- కిలో రూ.60

నిత్యావసర వస్తువుల రేట్లు..

  • కందిపప్పు(గ్రేడ్‌1)- కిలో రూ.95
  • మినపపప్పు- కిలో రూ.140
  • పెసరపప్పు- కిలో రూ.105
  • శెనగపప్పు- కిలో రూ.65
  • సజ్జలు- కిలో రూ.30
  • గోధుమలు- కిలో రూ.36,
  • జొన్నలు- కిలో రూ.38
  • రాగులు- కిలో రూ.40

For More News:

ఇండియా లాక్ డౌన్.. ఏ సేవలకు బ్రేక్.? ఏవి ఉంటాయి.?

‘ఇంటికి రావద్దు ప్లీజ్’.. కరోనా అనుమానితుల ఇళ్లకు రెడ్ నోటిసులు..

దేశంలో మొట్టమొదటి కోవిడ్ 19 ఆసుపత్రి.. రిలయన్స్ సంచలనం..

గుడ్ న్యూస్.. కరోనాలా హంటా వైరస్ కాదట… అసలు నిజమిదే.!

కరోనా ఎఫెక్ట్.. దేశవ్యాప్తంగా టోల్ గేట్ ఫీజులు రద్దు..