Breaking News
  • భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 38 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 138845. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 77103. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 57721. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4021. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • విశాఖ: చ౦ద్రబాబు విశాఖ పర్యటన రద్దు . విశాఖ విమానాశ్రయంకి రేపు వచ్చిపోయే విమానాలు రద్దు కావటంతో రద్దయిన చ౦ద్రబాబు పర్యటన. పోలీసు అనుమతి లభించినప్పటికి విమానాల రద్దుతో విశాఖ ప్రయాణం రద్దు.
  • నేటి నుండి ప్రారంభమైన విమాన సర్వీసులు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు ఒక్కొక్కరుగా చేరుకుంటున్న ప్రయాణికులు. 5.గంటలకు హైదరాబాద్ నుండి లక్నో వెళ్లిన మొదటి ఇండిగో ప్లైట్. 8 గంటలకు ముంబై నుండి హైదరాబాద్ కు రానున్న స్పెస్ జట్. అనేక క్యాన్సిలేషన్స్ జరగటం తో విమానాలను కుదించిన విమానయాన శాఖ. హైదరాబాద్ నుండి 100 విమానాలు తిరగవలసి ఉండగా 40 కి కుదించిన సర్వీసులు. ఆరోగ్య సేతు యాప్ ఉంటేనే ఎయిర్పోర్ట్ లోకి అనుమతి. ఖచ్చితమైన ఆరోగ్య వివరాలు సమాచారం ఇవ్వాలని ఆదేశం.
  • వరంగల్ 9 మర్డర్ కేసు లో సంచలన బ్రేకింగ్ . 9 మందిని హత్య చేసింది సంజయ్ . మాక్సుద్ భార్య చెల్లెలి తో సంబంధం ఉన్న సంజయ్. మాక్సుద్ భార్య చెల్లలి తో అక్రమ సంబంధం ఉన్న సంజయ్. తనకు అడ్డు రావొద్దని మాక్సుద్ కుటుంబం తో పాటు సన్నిహితంగా ఉన్న బిహారి యువకులను హత్య చేసిన సంజయ్.
  • వాట్సప్ ద్వారా అసభ్యకర మెసేజీలు పంపుతున్నాడు అని ట్రాఫిక్ హోంగార్డు పై షీ టీమ్ కు ఫిర్యాదు చేసిన మహిళా డాక్టర్. సుల్తాన్ బజార్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యురాలు లాక్‌డౌన్‌ సమయములో ట్రాఫిక్ హోంగార్డు వెంకటేష్ . కొద్దిరోజుల తర్వాత వాయిస్ మెసేజ్ లు పంపించడం మొదలు పెట్టిన హోంగార్డ్ వెంకటేష్ . వేధింపులు తట్టుకోలేక మహిళ డాక్టర్ షీ టీం పోలీసులకు ఫిర్యాదు . మహిళా డాక్టర్ ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన సీపీ అంజనీ కుమార్ . హోంగార్డు వెంకటేష్ ను సస్పెండ్ చేసిన సిపిఐ అంజనీ కుమార్.
  • కరోనా తెలంగాణా బులిటిన్ ఇవ్వాళ తాజాగా 41 పాజిటివ్ కేసులు నమోదు మొత్తం రాష్ట్రంలో 1854 కరోనా పాజిటివ్ కేసులు ఇవ్వాళ నలుగురు మృతి మొత్తం ఇప్పటివరకు 53 మంది కరోనా కు బలి అయ్యారు యాక్టీవ్ కేసులు 709 మంది చికిత్స పొందుతున్నారు.. ఇవ్వాళ 24 మంది డిశ్చార్జ్ కాగా మొత్తం 1092 మంది డిశ్చార్జ్ అయ్యారు..

సామాజిక దూరం పాటిస్తే.. ఇండియాలో కరోనా కేసులు 62 శాతం తగ్గుతాయట..!

COVID 19, సామాజిక దూరం పాటిస్తే.. ఇండియాలో కరోనా కేసులు 62 శాతం తగ్గుతాయట..!

COVID 19: కరోనా వైరస్ మహమ్మరి భారతదేశాన్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించగా.. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రజలందరూ ఖచ్చితంగా సామాజిక దూరాన్ని పాటిస్తే ఇండియాలో కోవిడ్ 19 కేసులను సుమారు 62 శాతం మేరకు తగ్గించేందుకు అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అటు ఈ మహమ్మారి ప్రపంచమంతా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ప్రజల్లో సోషల్ డిస్టెన్సింగ్ గురించి అవగాహన పెంచుతూ వస్తోంది. అంతేకాకుండా డాక్టర్లు సైతం ప్రజలు సామాజిక దూరాన్ని తమ జీవితాలలో ఒక భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ 19ను కట్టడి చేసేందుకు సామాజిక దూరం పాటించడమే ఒకే ఒక్క మార్గం అని ఐసీఎంఆర్ చెబుతోంది. తాజాగా ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ చేసిన అధ్యయనంలో ఇండియన్స్ సామాజిక దూరాన్ని, క్వారంటైన్‌ను పాటిస్తే భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య 62 శాతం మేరకు తగ్గుతుందని స్పష్టమైంది.

ఈ వైరస్ సంక్రమించకుండా ఉండేందుకు ప్రజలు తమకు తాము ఆంక్షలు విధించుకోవడమే కాకుండా వ్యాధి సోకిన వారికి, అలాంటి లక్షణాలు ఉన్నవారి దూరంగా ఉండాలని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. కరోనా వైరస్ ప్రపంచ మహామ్మరిగా మారడానికి రెండు వారాల ముందు ఈ సంస్థ ఓ అధ్యయనం చేసింది. భారతదేశంలో ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా రూపిందించింది.

మరోవైపు విమాన ప్రయాణాల ద్వారా కోవిడ్ 19 ప్రమాదం ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇండియా 17వ స్థానంలో ఉందని రిపోర్టు సూచించింది. అటు ఇండియాలో ఎక్కువగా అంతర్జాతీయ రాకపోకలు ఉన్న నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కత్తాలలో కోవిడ్ 19 వ్యాప్తిపై ఐసీఎంఆర్ రీసెర్చర్లు అంచనా వేశారు.

ఇప్పటివరకు కరోనా వైరస్ సోకిన వారికి 1.5 నుంచి 4.9 మీటర్ల దూరంలో ఉన్న కాంటాక్టులకే ఈ వ్యాధి సోకినట్లు వారి నివేదికలో తేలింది. కాబట్టి ఈ కోవిడ్ 19 వ్యాప్తి చెందకుండా కట్టడి చేసేందుకు ప్రజలు సామాజిక దూరాన్ని పాటించాలని కోరుకుంటున్నారు. కాగా, కరోనా వైరస్ దేశంలో చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 694 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 13 మంది ఈ వ్యాధి బారిన పడి మృతి చెందారు.

For More News:

ఇండియా లాక్ డౌన్.. ఏ సేవలకు బ్రేక్.? ఏవి ఉంటాయి.?

‘ఇంటికి రావద్దు ప్లీజ్’.. కరోనా అనుమానితుల ఇళ్లకు రెడ్ నోటిసులు..

దేశంలో మొట్టమొదటి కోవిడ్ 19 ఆసుపత్రి.. రిలయన్స్ సంచలనం..

గుడ్ న్యూస్.. కరోనాలా హంటా వైరస్ కాదట… అసలు నిజమిదే.!

కరోనా ఎఫెక్ట్.. దేశవ్యాప్తంగా టోల్ గేట్ ఫీజులు రద్దు..

కూరగాయలు, నిత్యావసర వస్తువుల రేట్లు ఫిక్స్.. ధరలు పెంచితే కేసులు తప్పవు..

Related Tags