ఏపీలో కరోనా తగ్గుముఖం.. ఒక్క రోజులో ఎన్ని కేసులంటే.!

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. టెస్టులు పెంచే కొద్దీ పాజిటివ్ కేసులు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి.

ఏపీలో కరోనా తగ్గుముఖం.. ఒక్క రోజులో ఎన్ని కేసులంటే.!
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 02, 2020 | 7:44 PM

Coronavirus Cases In Andhra Pradesh: ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. టెస్టులు పెంచే కొద్దీ పాజిటివ్ కేసులు రికార్డుస్థాయిలో నమోదవుతుండగా.. తాజాగా అవి కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. అటు రాష్ట్రంలో రికవరీ రేటు కూడా పెరగడం ప్రజలకు కాస్త ఊరటను ఇస్తోంది. గత మూడు రోజులుగా 10 వేలు పైచిలుక కేసులు నమోదు కాగా.. ఇవాళ కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య లక్షా 58 వేల 764కి చేరుకుంది. వీటిల్లో 74,404 యాక్టివ్ కేసులు ఉండగా.. 82, 886 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

ఇక గడిచిన 24 గంటల్లో 6,272 మంది కోవిడ్ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా డిశ్చార్జ్ అయ్యారు. 67 మంది వైరస్ కరణంగా మరణించారు. అటు జిల్లాల వారీగా నమోదైన కేసులు చూస్తే.. అనంతపురం 696, చిత్తూరు 781, తూర్పుగోదావరి 930, గుంటూరు 639, కడప 396, కృష్ణ 379, కర్నూలు 996, నెల్లూరు 448, ప్రకాశం 384, శ్రీకాకుళం 492, విశాఖపట్నం 1227, విజయనగరం 637, పశ్చిమ గోదావరిలో 550 కేసులు నమోదయ్యాయి.

Also Read: కరోనా డేంజర్ బెల్స్.. ఏపీలోని పలు జిల్లాల్లో లాక్‌డౌన్.!