తమిళనాడు గవర్నర్‌కు కోవిడ్ పాజిటివ్
దేశ వ్యాప్తంగా కోవిడ్ పాజిటివ్ కేసులు తీవ్రంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఎంతో మంది రాజకీయ నాయకులు, పలువురు సినీ, క్రీడా సెబ్రిటీలకు కరోనా సోకిన విషయం తెలిసిందే. అలాగే తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షాకు కూడా కరోనా వైరస్ నిర్థారణ అయినట్టు..
దేశ వ్యాప్తంగా కోవిడ్ పాజిటివ్ కేసులు తీవ్రంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఎంతో మంది రాజకీయ నాయకులు, పలువురు సినీ, క్రీడా సెబ్రిటీలకు కరోనా సోకిన విషయం తెలిసిందే. అలాగే తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షాకు కూడా కరోనా వైరస్ నిర్థారణ అయినట్టు ఆయనే స్వయంగా ట్వీట్ చేసి తెలిపారు. ఇప్పుడు తాజాగా తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరారు. ఆయన కోవిడ్ వచ్చినట్టు ఆస్పత్రి అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు గవర్నర్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసింది ఆస్పత్రి వర్గం.
తమిళనాడు గవర్నర్‌కి కేవలం మైల్డ్ లక్షణాలు మాత్రమే కనిపించాయని.. కొద్ది రోజులు చికిత్స తీసుకుంటే నయమైపోతుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం గవర్నర్ భన్వరీలాల్ హోం ఐసోలేషన్‌లోనే ఉండి వైద్యం తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. అలాగే ఆస్పత్రి వైద్యుల బృందం ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యం గురించి పరిశీలిస్తున్నట్లు కావేరి ఆస్పత్రి యాజమాన్యం ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా తమిళనాడు రాజ్ భవన్‌లో ముందు 87 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయిన విషయం తెలిసిందే.
Read More:
కేంద్ర మంత్రి అమిత్‌షాకు కరోనా పాజిటివ్
వాట్సాప్‌లో అదిరిపోయే అప్‌డేట్.. 138 కొత్త ఎమోజీలు..
‘క్యాస్టింగ్ కౌచ్’పై నటి ప్రగతి సంచలన కామెంట్స్..
సీఎం జగన్‌కు చెన్నైవాసి అరుదైన కానుక.. బంగారు, వెండితో మసీదు!