కరోనా కల్లోలం.. ఒక్క రోజులో 95,735 కేసులు, 1,172 మరణాలు..

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఒకే రోజులో అత్యధికంగా 95,375 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.దీనితో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 44,65,864కి చేరింది.

కరోనా కల్లోలం.. ఒక్క రోజులో 95,735 కేసులు, 1,172 మరణాలు..
Follow us

|

Updated on: Sep 10, 2020 | 11:33 AM

Coronavirurs In India: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఒకే రోజులో అత్యధికంగా 95,375 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.దీనితో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 44,65,864కి చేరింది. గడిచిన 24 గంటల్లో 1,172 మంది చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 75,062కు చేరుకుంది. ఇక 9,19,018 మంది చికిత్స తీసుకుంటుండగా.. ఇప్పటివరకు 34,71,784 మంది వైరస్ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

అటు మహారాష్ట్రలో కరోనా విలయం సృష్టిస్తోంది. నిన్న ఒక్క రోజే 23, 816 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య 10 లక్షలకు చేరువైంది. ఆంధ్రప్రదేశ్‌లో అయితే పాజిటివ్ కేసుల సంఖ్య 5 లక్షల 27 వేలకు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో నిన్న 4,039 కేసులు నమోదు కావడంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది. దేశవ్యాప్తంగా నిన్న ఒక్క రోజు 11,29,756 కరోనా టెస్టులు చేయగా.. ఇప్పటివరకు మొత్తంగా 5,29,34,433 పరీక్షలు నిర్వహించారు. కాగా, దేశంలో ప్రస్తుతం రికవరీ రేట్ 77.74 శాతం ఉండగా.. యాక్టివ్ కేసులు 20.58 శాతం.. మరణాల రేటు 1.68 శాతంగా ఉంది.

Also Read:

విశాఖను భయపెడుతున్న కొత్త వైరస్.. జనాల్లో హడల్..

‘మనసు మమత’ శ్రావణి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్..

తెలంగాణ సర్కార్ సంచలనం.. ఇకపై ‘లైఫ్‌టైమ్‌ క్యాస్ట్ సర్టిఫికెట్‌’..