లంక ప్రీమియర్ లీగ్‌ను తాకిన కరోనా.. ముగ్గురు ప్లేయర్స్‌కు పాజిటివ్.!

ఆరంభం నుంచి అడ్డంకులు ఎదుర్కుంటూ వస్తున్న లంక ప్రీమియర్ లీగ్.. మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే ఈలోపే ఆ లీగ్‌కు కరోనా వైరస్ సెగ తాకింది.

లంక ప్రీమియర్ లీగ్‌ను తాకిన కరోనా.. ముగ్గురు ప్లేయర్స్‌కు పాజిటివ్.!
Follow us

|

Updated on: Nov 22, 2020 | 8:19 AM

Lanka Premier League: ఆరంభం నుంచి అడ్డంకులు ఎదుర్కుంటూ వస్తున్న లంక ప్రీమియర్ లీగ్.. మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే ఈలోపే ఆ లీగ్‌కు కరోనా వైరస్ సెగ తాకింది. లీగ్‌లో ఆడేందుకు శ్రీలంక చేరుకున్న క్రికెటర్లకు కరోనా పరీక్షలు నిర్వహించడంతో ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. క్యాండీ టస్కర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పాకిస్తాన్ ఆటగాడు సోహైల్ తన్వీర్, కొలంబో కింగ్స్ జట్టు సభ్యుడు, కెనడా బ్యాట్స్‌మెన్ రవీందర్ పాల్ సింగ్‌లు కరోనా బారిన పడ్డారు.

వీరు రెండు వారాల పాటు హోం క్వారంటైన్‌లో ఉండనున్నారు. కాగా, ఈ నెల 26న లంక ప్రీమియర్ లీగ్‌ను మొదలుపెట్టనున్నారు. ఈ లీగ్‌లో మొత్తం 23 మ్యాచ్‌లు జరగుతాయి. మొదట ఈ మ్యాచులను మూడు స్టేడియంలలో జరగపాలని చూశారు. అయితే దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వాటినన్నింటినీ ఒకే వేదికలో నిర్వహించనున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఇందుకు హంబన్‌తోట వేదికను ఎంపిక చేశారు. ఈ లీగ్ ఫైనల్ డిసెంబర్ 17న జరగనుంది. కాగా, స్టార్ ప్లేయర్స్ గేల్, లసిత్ మలింగా, సర్ఫరాజ్ అహ్మద్, రవి బొపారా మొదలగున వారు ఈ లీగ్ నుంచి తప్పుకున్నారు.

Also Read:

మాస్క్ లేకుంటే రూ. 2 వేలు భారీ జరిమానా.. నోటిఫికేషన్ జారీ చేసిన సర్కార్…

రోజుకు గరిష్టంగా 12 గంటలు.. వారానికి 48 గంటలు.. కార్మిక శాఖ కొత్త ప్రతిపాదన..

ఆరేళ్లుగా వీడని మిస్టరీ కేసు.. నిందితులను పట్టిస్తే రూ. 5 లక్షల డాలర్ల రివార్డు.!

వచ్చే ఐపీఎల్‌కు చెన్నై జట్టు భారీ మార్పులు.. ఆ ఐదుగురిపై వేటు తప్పదు.. లిస్టులో ధోని.!