ప్రపంచవ్యాప్తంగా 28 మిలియన్లకు చేరువలో కరోనా కేసులు..
ప్రపంచవ్యాప్తంగా 27,785,551 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 902,775 మంది కరోనాతో చనిపోయారు. ఇదిలా ఉంటే 19,881,039 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. దేశాలన్నీ కూడా దశల వారీగా అన్ లాక్ ప్రక్రియను మొదలుపెట్టడంతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ వైరస్ 213 దేశాలకు పాకింది. తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 27,785,551 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 902,775 మంది కరోనాతో చనిపోయారు. (Corona Cases In World)
ఇదిలా ఉంటే 19,881,039 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో ప్రపంచంలో 2,47,204 పాజిటివ్ కేసులు, 4479 మరణాలు సంభవించాయి. అమెరికా, బ్రెజిల్, రష్యా దేశాల్లో కరోనా తీవ్రతరంగా ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధిక కేసులు(6,514,603), మరణాలు(194,064) సంభవించాయి. ఇక భారత్‌లో కరోనా కేసులు 4,382,518 నమోదు కాగా, మృతుల సంఖ్య 74,028కి చేరింది.
Also Read:
విశాఖను భయపెడుతున్న కొత్త వైరస్.. జనాల్లో హడల్..
‘మనసు మమత’ శ్రావణి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్..
తెలంగాణ సర్కార్ సంచలనం.. ఇకపై ‘లైఫ్‌టైమ్ క్యాస్ట్ సర్టిఫికెట్’..
