Maharashtra Corona Virus: మహారాష్ట్రలో మళ్ళీ జడలు విప్పిన కరోనా, ముంబైలో లోకల్ రైలు సర్వీసులకు తాత్కాలిక బ్రేక్ ?

మహారాష్ట్రలో కరోనా వైరస్ మళ్ళీ బలంగా వ్యాపిస్తోంది. ముంబైలో వరుసగా ఐదో రోజూ కూడా 987 కేసులు నమోదయ్యాయి. నలుగురు కరోనా రోగులు మృతి చెందారు..

  • Umakanth Rao
  • Publish Date - 4:07 pm, Sun, 28 February 21
Maharashtra Corona Virus: మహారాష్ట్రలో మళ్ళీ జడలు విప్పిన కరోనా, ముంబైలో లోకల్ రైలు సర్వీసులకు తాత్కాలిక బ్రేక్ ?

Maharashtra Corona Virus:  మహారాష్ట్రలో కరోనా వైరస్ మళ్ళీ బలంగా వ్యాపిస్తోంది. ముంబైలో వరుసగా ఐదో రోజూ కూడా 987 కేసులు నమోదయ్యాయి. నలుగురు కరోనా రోగులు మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,24,866 కి చేరింది. మృతుల సంఖ్య 11,470 కి పెరిగింది.  అమరావతిలో ఈ 5 రోజుల్లో 4061 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. 32 మంది మరణించారు. ముంబైలో పెరుగుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో లోకల్ రైలు సర్వీసులను తగ్గించాలని, తాత్కాలికంగా మాల్స్, వీక్లీ మార్కెట్లను మూసివేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అధికారులు ఇప్పటికే విదర్భ రీజన్ లోని 5 జిల్లాల్లో లాక్ డౌన్ పొడిగించారు. పుణేలో మార్చి 14 వరకు స్కూళ్ళు, కాలేజీలను మూసివేయాలని నిర్ణయించారు. అలాగే కోచింగ్, ఇతర విద్యా సంస్థలను కూడా మూసివేస్తామని మేయర్ ప్రకటించారు.

ఈ నెల 24 నుంచి రోజూ దాదాపు వెయ్యి కొత్త కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయని సమాచారం అందిందన్నారు. విలువుర్ధనా, యావత్ మల్, వాసిం, అకోలా ప్రాంతాల్లో పెళ్లిళ్ల హాళ్లను మార్చి  7 వరకు మూసివేయాలని ఆదేశించారు. అలాగే నాగపూర్ లో వచ్చే నెల 7 వరకు స్కూళ్ళు, కాలేజీలను బంద్ చేయాలనీ ఆదేశించినట్టు మేయర్ చెప్పారు. ఇలా ఉండగా దేశంలో గత 24 గంటల్లో 16,752 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 113 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,10,96. 731 కి చేరింది. శనివారం ఢిల్లీలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో మహారాష్ట్రతో బాటు పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేహ్, ఛత్తీస్ గఢ్, తెలంగాణ, బెంగాల్, జమ్మూ కాశ్మీర్ లలో వ్యాక్సినేషన్ డ్రైవ్ ని విస్తృతంగా చేపట్టాలని నిర్ణయించారు. ప్రధాని మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో.. నీటి వనరులను ఆదా చేయాలని పిలుపునిస్తూనే దేశంలో కోవిడ్ నియంత్రణలో ప్రజలు ఇదివరకు మాదిరే కచ్చితంగా ప్రొటొకాల్స్ ని పాటించాలని సూచించారు. చాలావరకు ఈ వైరస్ ని నియంత్రించగలిగామని, కొన్ని రాష్ట్రాల్లోనే ఈ కోవిద్ బలంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజల సహకారం ఉంటే ఈ వ్యాధిని పూర్తిగా అదుపు చేయగలుగుతామని ఆయన అభిప్రాయపడ్డారు.

 

Also Read:

Army recruitment exam paper leak: ఆర్మీ ఎగ్జామ్ పేపర్​ లీక్​.. దేశవ్యాప్తంగా పరీక్ష రద్దు.. పూర్తి వివరాలు

ICC Test Rankings: టెస్టు ర్యాంకింగ్స్​‌లో టాప్ లేపిన రోహిత్ శర్మ.. ఏకంగా 6 స్థానాలు ఎగబాకి.. కెరీర్ బెస్ట్