విషాదం..స్టేషన్‌లోనే కానిస్టేబుల్ సూసైడ్..

కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మాచారెడ్డి పోలీస్ స్టేషన్‌లో పనిచేసే కానిస్టేబుల్ లచ్చయ్య స్టేషన్‌లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 1990 బ్యాచ్ కు చెందిన లచ్చయ్యకు 52 సంవత్సరాలు. బుధవారం స్టేషన్‌లో ఎవరూ లేని సమయంలో బ్యారక్‌లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోవడం సంచలనంగా మారింది. అతడు సొంతూరు జనగామ. విషయం తెలుసుకున్న స్టేషన్ స్టాఫ్ షాక్‌కు గురయ్యారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా సూసైడ్‌కు కారణాలు తెలియరాలేదు. మాచారెడ్డి పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్న ఎస్పీ […]

విషాదం..స్టేషన్‌లోనే కానిస్టేబుల్ సూసైడ్..
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 29, 2020 | 7:03 PM

కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మాచారెడ్డి పోలీస్ స్టేషన్‌లో పనిచేసే కానిస్టేబుల్ లచ్చయ్య స్టేషన్‌లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 1990 బ్యాచ్ కు చెందిన లచ్చయ్యకు 52 సంవత్సరాలు. బుధవారం స్టేషన్‌లో ఎవరూ లేని సమయంలో బ్యారక్‌లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోవడం సంచలనంగా మారింది. అతడు సొంతూరు జనగామ. విషయం తెలుసుకున్న స్టేషన్ స్టాఫ్ షాక్‌కు గురయ్యారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా సూసైడ్‌కు కారణాలు తెలియరాలేదు. మాచారెడ్డి పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్న ఎస్పీ శ్వేతారెడ్డి ..ఘటనపై ఆరా తీశారు. పారదర్శకంగా విచారణ చేయాలని స్టేషన్‌ సీఐను ఆదేశించారు.