ప్రజాదర్బార్‌లో అమీతుమీ: మంత్రిపై తిరగబడాలన్న ఎంపీ

ఆదిలాబాద్ జిల్లా నాగోబా ప్రజాదర్బార్ మాటల మంటలతో వేడెక్కింది. ఆదిలాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ సోయం బాపూరావు వివాదాస్పద వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. ఆదివాసీలను నాశనం చేసేందుకు ఫారెస్టు అధికారులు కుట్ర చేస్తున్నారంటూ బాపూరావు ఆగ్రహంతో ఊగిపోయారు. ఆదివాసీల మీద కేసులు పెడితే మంచిది కాదన్నారు. ఆదివాసీలు తిరగబడితే ఫారెస్టు అధికారులు విధినిర్వహణకు వెళ్ళలేరన్న విషయం మరువొద్దని హెచ్చరించారు ఎంపీ. అటవీశాఖ అధికారులపై ఆగ్రహంతో రెచ్చిపోయిన సోయం బాపురావ్.. ‘‘తిరగబడితేనే భూములుంటాయి.. పట్టాలుంటాయి లేదంటే భూములండవు…అందుకే […]

ప్రజాదర్బార్‌లో అమీతుమీ: మంత్రిపై తిరగబడాలన్న ఎంపీ
Follow us
Rajesh Sharma

|

Updated on: Jan 29, 2020 | 6:37 PM

ఆదిలాబాద్ జిల్లా నాగోబా ప్రజాదర్బార్ మాటల మంటలతో వేడెక్కింది. ఆదిలాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ సోయం బాపూరావు వివాదాస్పద వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. ఆదివాసీలను నాశనం చేసేందుకు ఫారెస్టు అధికారులు కుట్ర చేస్తున్నారంటూ బాపూరావు ఆగ్రహంతో ఊగిపోయారు.

ఆదివాసీల మీద కేసులు పెడితే మంచిది కాదన్నారు. ఆదివాసీలు తిరగబడితే ఫారెస్టు అధికారులు విధినిర్వహణకు వెళ్ళలేరన్న విషయం మరువొద్దని హెచ్చరించారు ఎంపీ. అటవీశాఖ అధికారులపై ఆగ్రహంతో రెచ్చిపోయిన సోయం బాపురావ్.. ‘‘తిరగబడితేనే భూములుంటాయి.. పట్టాలుంటాయి లేదంటే భూములండవు…అందుకే తిరగబడండి..’’ అంటూ ఆదివాసీలకు పిలుపునిచ్చారు ఎంపీ సోయం బాపురావ్.

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఏం వాగ్దానాలు చేసారో అవన్నీ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు ఎంపీ. టెంపుల్ అభివృద్ధికి 50 లక్షలు ఇస్తామన్నారు.. ఆ నిధులెక్కడ అని మంత్రిని నిలదీశారు. ఎస్టీ జాబితా నుంచి ఎప్పటికైనా లంబాడాలను తొలగించి తీరతామన్నారు బాపూరావు. ‘‘ఐక్యంగా ఉండాలి పోరాటం చేయాలి.. అప్పుడే ప్రభుత్వాలు గుర్తిస్తాయి..’’ అంట ఆదీవాసీలకు సూచించారు. కేంద్రం నుంచి వచ్చే నక్సల్ ప్రభావిత ప్రాంతాలకు వచ్చే నిధులను ఆదిలాబాద్ జిల్లాలో వినియోగించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కోరారు.

ఓవైపు ఎంపీ మాటల మంటలతో రెచ్చిపోతుంటే.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. సున్నితంగా ఆయనకు బదులిచ్చారు. నాగోబా దేవాలయ నిర్మాణానికి కావాల్సిన నిధులన్నీ ఇస్తామని చెప్పారు మంత్రి. రాజగోపురాలు, గ్రైనేట్, ఆర్చిల నిర్మాణాలకు ఐదు కోట్ల రూపాయల పనులకు టెండర్లకు ఎవరు ముందుకు రాలేదని వివరించారాయన.

ఆదివాసీల పోడు భూముల జోలికి ప్రభుత్వం రాబోదని, పోడుభూములకు హక్కుపత్రాలు కూడా తప్పకుండా ఇస్తామని మంత్రి చెప్పారు. అటవీశాఖ అధికారులు ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదన్నారు. అడవులు అంతరించిపోతే… మానవ మనుగడ ఉండదని, అందుకే విరివిగా మొక్కలు నాటాలని మంత్రి సూచించారు. ‘‘మీభూములు మీకుంటాయి.. సీఎం కేసీఆర్ స్వయంగా వచ్చి పరిష్కారం చేస్తారు’’ అంటూ మంత్రి ఆదీవాసీలకు హామీ ఇవ్వడంతో ప్రజాదర్బార్‌లో వాదోపవాదాలు సద్దుమణిగాయి.