కేరళ కాంగ్రెస్ నేత నోటిదురుసు, క్షమాపణ !

కేరళ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు ముల్లపల్లి రామచంద్రన్ మహిళలను ఉద్దేశించి మొదట తాను చేసిన వ్యాఖ్యకు ఆ తరువాత క్షమాపణ చెప్పారు. తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ఒక మహిళ తాను అత్యాచారానికి గురయ్యానని చెబితే ఆమె క్షోభను అర్థం చేసుకోవచ్చునని, అయితే ఆత్మగొరవం గల మహిళ రేప్ కి గురైతే ఆత్మహత్య చేసుకోవడమో, లేదా తిరిగి అలాంటిది జరగకుండా చేసుకోవడమో చేస్తుందని అన్నారు. అయితే దీనిపై ఆరోగ్య శాఖ మంత్రి కేకే. శైలజ […]

  • Publish Date - 8:58 pm, Sun, 1 November 20 Edited By: Pardhasaradhi Peri
కేరళ కాంగ్రెస్ నేత నోటిదురుసు, క్షమాపణ !

కేరళ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు ముల్లపల్లి రామచంద్రన్ మహిళలను ఉద్దేశించి మొదట తాను చేసిన వ్యాఖ్యకు ఆ తరువాత క్షమాపణ చెప్పారు. తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ఒక మహిళ తాను అత్యాచారానికి గురయ్యానని చెబితే ఆమె క్షోభను అర్థం చేసుకోవచ్చునని, అయితే ఆత్మగొరవం గల మహిళ రేప్ కి గురైతే ఆత్మహత్య చేసుకోవడమో, లేదా తిరిగి అలాంటిది జరగకుండా చేసుకోవడమో చేస్తుందని అన్నారు. అయితే దీనిపై ఆరోగ్య శాఖ మంత్రి కేకే. శైలజ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో రామచంద్రన్ అపాలజీ చెప్పారు. రాష్ట్రంలో అవినీతి, అత్యాచారాలు పెరిగిపోయాయని ఆయన అన్నారు. సీఎం విజయన్ ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆయన ఆరోపించారు.