సీఎం‌ జగన్ పెద్దమామ‌ కన్నుమూత

సీఎం జ‌గ‌న్ పెద్దమామ, ముఖ్య‌మంత్రి సతీమణి వైఎస్‌ భారతిరెడ్డి పెద్దనాన్న ఇసీ పెద్ద గంగిరెడ్డి (78) శనివారం తుదిశ్వాస విడిచారు.

సీఎం‌ జగన్ పెద్దమామ‌ కన్నుమూత
Ram Naramaneni

|

Sep 06, 2020 | 8:13 AM

సీఎం జ‌గ‌న్ పెద్దమామ, ముఖ్య‌మంత్రి సతీమణి వైఎస్‌ భారతిరెడ్డి పెద్దనాన్న ఇసీ పెద్ద గంగిరెడ్డి (78) శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన కొద్ది రోజులుగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. పులివెందులలోని ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుని ఇటీవల సొంతూరు గొల్లలగూడూరులోని తన ఇంటికి చేరుకున్నారు. అయితే శనివారం ఉదయం 5 గంటల సమయంలో పరిస్థితి ఒక్క‌సారిగగా విష‌మించింది. వెంట‌నే పులివెందుల ఆస్ప‌త్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో క‌న్నుమూశారు. విషయం తెలిసిన వెంటనే ముఖ్య‌మంత్రి‌ తల్లి, వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, సీఎం సతీమణి వైఎస్‌ భారతిరెడ్డి గొల్లలగూడూరు చేరుకుని గంగిరెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. గ్రామ సమీపంలోని సొంత తోట వద్ద ఆయ‌న‌ అంత్యక్రియలు నిర్వహించారు.

CM YS Jagan Relative Pedda Gangi Reddy Passes Away - Sakshi

Also Read :

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం

శిరోముండనం కేసులో నూతన్​ నాయుడుకు రిమాండ్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu