AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishna Water: అరుదైన ఘట్టానికి కౌంట్‌ డౌన్‌.. వెలిగొండకు కృష్ణా జలాలు.. ప్రారంభించనున్న చంద్రబాబు

Krishna Water: మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలం గంటవానిపల్లె సమీపంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు 31వ తేది వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి, జాతికి అంకితం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. వెలిగొండ పీడర్ కాలువ 4. 2 కి.మీ. దగ్గర ఉన్న క్రాస్..

Krishna Water: అరుదైన ఘట్టానికి కౌంట్‌ డౌన్‌.. వెలిగొండకు కృష్ణా జలాలు.. ప్రారంభించనున్న చంద్రబాబు
Krishna Water
Fairoz Baig
| Edited By: |

Updated on: Aug 30, 2026 | 1:49 PM

Share

వెలిగొండ ప్రాజెక్టులో 30 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న అరుదైన ఘట్టం మొదలైంది. శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ కొల్లం వాగు నుండి వెలిగొండ ప్రాజెక్టు జంట సొరంగాల ద్వారా ఫీడర్ కెనాల్ కు కొంత మేర నీటిని వదిలి అధికారులు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. రెండు సొరంగాల నుంచి వస్తున్న కృష్ణా జలాలు ఫీడర్ కెనాల్ దగ్గరకు చేరుకుంటున్నాయి. రేపు ఫీడర్ కెనాల్ ద్వారా కృష్ణా జలాలను సీఎం చంద్రబాబు నల్లమల సాగర్ రిజర్వాయర్ లోకి వదిలిపెట్టనున్నారు. సీఎం చంద్రబాబు పర్యటన కోసం ఏర్పాట్లను మంత్రులు గొట్టిపాటి, నిమ్మల, డోలా ప్రాజెక్టు దగ్గరే ఉండి పర్యవేక్షిస్తున్నారు.

ఈ సందర్భంగా శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ దగ్గర కొల్లం వాగు నుండి 0.8 మీటర్ల మేర రెండు హెడ్ రెగ్యులేటర్ గేట్స్ ఎత్తి వెలిగొండ ప్రాజెక్ట్ కు నీటిని విడుదల చేశారు అధికారులు. కృష్ణా జలాలు ఫీడర్ కెనాల్ ల్లోకి ప్రవేశించడంతో రెండవ ప్రమాద హెచ్చరికను జారీచేశారు. ఇప్పటికే ప్రాజెక్టులో పూర్తి ముంపు గ్రామాలుగా ఉన్న సుంకేశుల, కలనూతల, గుండంచర్ల గ్రామాలను నిర్వాసితులు ఖాళీ చేశారు. మిగిలిన గ్రామాల నిర్వాసితులు కూడా ఊళ్ళను వదిలి వెళుతున్నారు.

ఇది కూడా చదవండి: BSN-Vi: చేతులు కలిపిన బీఎస్‌ఎన్‌ఎల్‌, వోడాఫోన్ ఐడియా.. యూజర్లకు అదిరిపోయే న్యూస్!

ఈ నేపధ్యంలోనే మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలం గంటవానిపల్లె సమీపంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు 31వ తేది వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి, జాతికి అంకితం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. వెలిగొండ పీడర్ కాలువ 4. 2 కి.మీ. దగ్గర ఉన్న క్రాస్ రెగ్యులేటర్ దగ్గర శ్రీశైలం జలాశయంలోని కొల్లం వాగు నుంచి కృష్ణా జలాలను తరలిస్తారు. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు జలహారతి ఇచ్చి క్రాస్ రెగ్యు లేటర్ గేట్లను ఎత్తి, నీటిని నల్లమలసాగర్ జలాశయానికి విడిచిపెడతారు.

ఇందుకోసం పైలాన్ నిర్మాణం, జల హారతి ఇచ్చేందుకు ఫీడర్ కాలువలో మెట్ల నిర్మాణ పనులు చేపట్టారు. ఆ ప్రదేశంలోనే మహిళలు, చిన్నారులు ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో సియం చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తారు. గతంలో ఈ ప్రాంతం మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్‌, పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, డోలా బాల వీరాంజనేయస్వామి, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు ఎమ్మెల్యేలు, యర్రగొండపాలెం టిడిపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు, మార్కాపురం కలెక్టర్ విజయ సునీత, ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సీఎం పర్యటన విజయవంతానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రులు దిశానిర్దేశం చేశారు. ఇక వెలిగొండ ప్రాజెక్టు రెండు సొరంగాల ద్వారా ఫీడర్‌ కెనాల్‌కు సియం చంద్రబాబు చేతుల మీదుగా నల్లమలసాగర్‌ రిజర్వాయర్‌ను కృష్ణా జలాలలతో నీటిని నింపేందుకు కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైంది.

ఇది కూడా చదవండి: RBI: రూ.500 నోటు అసలుదా? నకిలీదా? ఈ 3 సీక్రెట్ ఫీచర్లతో క్షణాల్లో గుర్తించండి!

ఇది కూడా చదవండి: House Wiring: హౌస్ వైరింగ్‌లో ఏది సేఫ్? కాపర్ లేదా అల్యూమినియం వైర్ల మధ్య తేడాలివే!

Follow Us