AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సర్పానికి సర్జరీ చేసి ప్రాణం పోశారు.. నాగ జెర్రీ గురించి మీకు తెలుసా..?

విశాఖపట్నంలో వలలో చిక్కుకుని తీవ్రంగా గాయపడిన ఆరడుగుల ‘నాగ జెర్రీ’ పాముకు స్నేక్‌ క్యాచర్‌, వెటర్నరీ వైద్యుడు కలిసి ప్రాణం పోశారు. శ్రీహరిపురం సమీపంలోని క్రాంతినగర్‌లో ఇంటి చుట్టూ ఏర్పాటు చేసిన ఇనుప కంచె, వలలో పాము చిక్కుకుంది. శరీరంపై తీవ్ర గాయాలతో కొన ఊపిరితో ఉన్న దానిని స్నేక్‌ క్యాచర్‌ నాగరాజు రక్షించి, వెటర్నరీ వైద్యుడు సునీల్‌ కుమార్‌ను సంప్రదించారు.

సర్పానికి సర్జరీ చేసి ప్రాణం పోశారు.. నాగ జెర్రీ గురించి మీకు తెలుసా..?
Visakhapatnam Snake Rescue
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Sep 01, 2026 | 10:09 AM

Share

విశాఖలో ఆరడుగుల పాము కలకలం రేపింది. ఇంటి చుట్టూ రక్షణ కోసం వేసిన వలలో చిక్కుకొని విలవిల్లాడింది. గాయపడి కొన ఊపిరితో ఉన్న ఆ పామును రెస్క్యూ చేశాడు స్నేక్ క్యాచర్. సపర్యలు చేసి వెటర్నరీ డాక్టర్‌ను సంప్రదించాడు. ఆరు కుట్లు వేసి గాయాలకు చికిత్స చేశాడు వెటర్నరీ వైద్యుడు. శ్రీహరిపురం సమీపంలోని క్రాంతి నగర్. కొండ సమీపంలో ఇల్లు ఉండటంతో.. ఇంటి చుట్టూ రక్షణ కోసం ఇనుప కంచె, వలవేశాడు యజమాని. ఎక్కడ నుంచి వచ్చిందో ఏమో కానీ ఓ భారీ పాము అందులో చిక్కుకుంది. తీవ్రంగా గాయపడి విలవిల్లాడిపోతోంది. చివరకు ప్రాణం పోయే పరిస్థితి ఎదురైంది ఆ పాముకు. గమనించిన యజమాని దావీదు.. స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న స్నేక్ క్యాచర్ నాగరాజు.. ఆ పామును నాగ జెర్రీగా గుర్తించాడు. ఆరడుగుల పొడవు ఉన్న నాగ జెర్రి విష రహిత పాము.. అనంతరం అతి కష్టం మీద ఆ వలలో చిక్కుకున్న పామును బయటకు తీశాడు.

అప్పటికే శరీరంపై బలమైన గాయాలు ఉన్నాయి. తోలు కొన్నిచోట్ల ఊడిపోయింది. మెడ ప్రాంతంలో గాయమైంది. కొన ఊపిరితో ఉన్న ఆ పామును చూసి చలించి పోయాడు స్నేక్ క్యాచర్ నాగరాజు. వెంటనే సిందియా ప్రాంతంలోని వెటర్నరీ వైద్యుడు సునీల్ కుమార్ ను సంప్రదించాడు. హుటాహుటిన పాముకు సపర్యలు చేసి.. వైద్య సాయం అందించారు. గంటన్నర పాటు శ్రమించి.. పాము గాయానికి ఆరు కుట్లు వేశారు. మిగిలిన చోట్ల డ్రెస్సింగ్ చేశారు.

వీడియో చూడండి..

పాము పూర్తిగా కోలుకున్న తర్వాత.. దానిని సురక్షితమైన ప్రదేశంలో విడిచిపెడతామని అంటున్నాడు స్నేక్ కేచర్ నాగరాజు. తీవ్రంగా గాయపడిన పాముకు ప్రాణం పోసేలా సపర్యాలు చేసిన స్నేహ క్యాచర నాగరాజు, వెటర్నరీ వైద్యుడు సునీల్ కుమార్ ను అభినందిస్తున్నారు జంతు ప్రేమికులు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సర్పానికి సర్జరీ చేసి ప్రాణం పోశారు.. నాగ జెర్రీ గురించి తెలుసా..
సర్పానికి సర్జరీ చేసి ప్రాణం పోశారు.. నాగ జెర్రీ గురించి తెలుసా..
క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా?
క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా?
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది
సింగర్ ప్రభ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?
సింగర్ ప్రభ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే