AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BSNL-Vi: చేతులు కలిపిన బీఎస్‌ఎన్‌ఎల్‌, వోడాఫోన్ ఐడియా.. యూజర్లకు అదిరిపోయే న్యూస్!

BSNL Vi Partnership: ఈ నెట్‌వర్క్ షేరింగ్ డీల్ వల్ల BSNL 5G వేగవంతం కానుందా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం BSNL దేశవ్యాప్తంగా తన 4G నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. ఈ 4G టవర్లను త్వరలోనే 5G కి అప్‌గ్రేడ్ చేసే..

BSNL-Vi: చేతులు కలిపిన బీఎస్‌ఎన్‌ఎల్‌, వోడాఫోన్ ఐడియా.. యూజర్లకు అదిరిపోయే న్యూస్!
Vi Bsnl
Subhash Goud
|

Updated on: Aug 30, 2026 | 2:43 PM

Share

BSNL Vi Partnership: టెలికాం రంగంలో ప్రభుత్వ రంగానికి చెందిన BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) మరియు ప్రైవేట్ దిగ్గజం Vodafone Idea (Vi) చేతులు కలిపాయి. ఈ రెండు కంపెనీల మధ్య జరిగిన కీలకమైన ‘నెట్‌వర్క్ షేరింగ్ ఒప్పందం’ (ICR – Intra Circle Roaming) వల్ల నెట్‌వర్క్ కవరేజ్ మరింత బలోపేతం కానుంది. ఈ భాగస్వామ్యంతో యూజర్లకు మెరుగైన కవరేజ్ లభించడమే కాకుండా BSNL 5G సేవల రాకకు దారి సుగమం కానుందా అనే చర్చ ప్రారంభమైంది.

ఇది కూడా చదవండి: House Construction: ఇంటి గోడలపై పగుళ్లు వస్తున్నాయా? ఈ 9 తప్పులు చేయకపోతే మీ భవనం నూరేళ్లు పదిలం!

ఒప్పందంలో కీలక విషయాలు:

  1. మెరుగైన కవరేజ్: BSNL, Vi పరస్పరం తమ టవర్లను, నెట్‌వర్క్ మౌలిక వసతులను పంచుకుంటాయి. దీనివల్ల Vi టవర్లు ఉన్నచోట BSNL సిగ్నల్, BSNL నెట్‌వర్క్ బలంగా ఉన్న ప్రాంతాల్లో Vi యూజర్లకు మెరుగైన సిగ్నల్ లభిస్తాయి.
  2. సిగ్నల్ కవరేజ్ లేని ప్రాంతాలకు ఊరట: గ్రామీణ ప్రాంతాలు, సరిహద్దు పరిసరాల్లో బిఎస్ఎన్ఎల్ కవరేజ్ బలంగా ఉండగా, నగరాలు, పట్టణ ప్రాంతాల్లో Vi మౌలిక వసతులు మెరుగ్గా ఉన్నాయి. ఈ ఒప్పందంతో రెండు కంపెనీల వినియోగదారులకు నెట్‌వర్క్ లోపాలు లేకుండా సేవలు అందుతాయి.
  3. కస్టమర్లకు లబ్ధి: ముఖ్యంగా రీఛార్జ్ ధరలు పెరిగిన తర్వాత BSNL వైపు మొగ్గు చూపిన వినియోగదారులకు ఇండోర్ కవరేజ్, డేటా స్పీడ్ పరంగా ఎదురవుతున్న సమస్యలకు ఈ నిర్ణయం పెద్ద ఊరట నివ్వనుంది.

ఇది కూడా చదవండి: House Construction Guide: ఇల్లు కడుతున్నారా? ఎలాంటి ఇటుక వాడాలి? ఈ పొరపాటు చేస్తే అంతే..!

ఇవి కూడా చదవండి

BSNL 5G రాబోతోందా?

ఈ నెట్‌వర్క్ షేరింగ్ డీల్ వల్ల BSNL 5G వేగవంతం కానుందా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం BSNL దేశవ్యాప్తంగా తన 4G నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. ఈ 4G టవర్లను త్వరలోనే 5G కి అప్‌గ్రేడ్ చేసే విధంగా స్వదేశీ సాంకేతికతతో రూపకల్పన చేస్తున్నారు.

Vi ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో 5G ట్రయల్స్, విస్తరణపై దృష్టి పెట్టడంతో ఈ భాగస్వామ్యం ద్వారా BSNL కూడా తన యూజర్లకు త్వరలోనే 5G అనుభవాన్ని అందించేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది.

ఇది కూడా చదవండి: House Wiring: హౌస్ వైరింగ్‌లో ఏది సేఫ్? కాపర్ లేదా అల్యూమినియం వైర్ల మధ్య తేడాలివే!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా