Chandrababu: మాట తప్పడం ఇష్టం లేక వాస్తవాలు చెబుతున్నా: సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
ఏపీని శ్రీలంక పరిస్థితికి గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని సీఎం చద్రబాబు ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే.. ప్రజలకు ఇబ్బందులు తప్పవని ఆయన అన్నారు. అమరావతి, పోలవరం, స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం ఇచ్చిన నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించలేమని తెలిపారు. మాట తప్పడం ఇష్టం లేక వాస్తవాలు చెబుతున్నానని, ప్రజలు అర్థం చేసుకోవాలని.. సూచించారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అఖండ మెజార్టీతో అధికారంలోకి రావడానికి సూర్ సిక్స్ హామీలు కూడా ప్రధాన కారణం. ప్రభుత్వంపై దాదాపు రూ. 9లక్షల కోట్ల అప్పుల భారం ఉండటంతో ఎన్నికల హామీలలో ముఖ్యమైన సంక్షేమ పథకాలకు నిధులు సమకూర్చడం ఏపీ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సామాజిక పెన్షన్‌లను రూ4వేలకు పెంచడంతో పాటు, అన్న క్యాంటీన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్ హామీలు ఒక్కొక్కటిగా అమలు చేశారు. అయితే సూపర్ సిక్స్ హామీలలో మిగిలిన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ అమలుకు ఆర్థిక వెసులుబాటు దొరకడం లేదని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నీతి ఆయోగ్ విడుదల చేసిన రిపోర్ట్‌ని సీఎం చంద్రబాబు ప్రజలకు వివరించారు.
ఏపీని శ్రీలంక పరిస్థితికి గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని సీఎం చద్రబాబు ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే.. ప్రజలకు ఇబ్బందులు తప్పవని ఆయన అన్నారు. అమరావతి, పోలవరం, స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం ఇచ్చిన నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించలేమని తెలిపారు. ఆర్థిక వెసులుబాటు దొరకగానే తల్లికి వందనం అన్నదాత సుఖీభవ పథకాలు ఇస్తామని.. మాట తప్పడం ఇష్టం లేక వాస్తవాలు చెబుతున్నానని ప్రజలు అర్థం చేసుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు.
ఇటు చంద్రబాబు ప్రకటనపై వైసీపీ స్పందించింది. హామీలు నెరవేర్చలేకపోతున్నానని చంద్రబాబు చెప్పేశారని.. అప్పులు, ఆర్థిక పరిస్థితి సాకుగా చూపి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎగ్గొట్టే ప్రయత్నంచేస్తున్నారని మాజీ మంత్రి అంబటి విమర్శించారు. సూపర్ సిక్స్ హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.
మొత్తానికి తాజాగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనతో మళ్లీ రాజకీయాలు వేడెక్కాయి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..