Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దంగల్ మూవీ నటి ఫాతిమాషేక్ కామెంట్స్‌పై టాలీవుడ్‌ ప్రముఖులు ఫైర్‌

సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌ అంశం మళ్లీ కలకలం రేపుతోంది. దంగల్ మూవీ నటి ఫాతిమాషేక్ కామెంట్స్‌పై టాలీవుడ్‌ ప్రముఖులు ఫైర్‌ అవుతున్నారు. తాజాగా.. టాలీవుడ్‌లో క్యా్స్టింగ్‌ కౌచ్‌ వివాదంపై నిర్మాత ముత్యాల రాందాస్‌ రియాక్ట్‌ అయ్యారు. కోరికలు తీరిస్తేనే ఛాన్సులు అని టాలీవుడ్‌పై ఆరోపణలు చేయడం కరెక్ట్‌ కాదన్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే టాలీవుడ్‌లోని ప్రత్యేక కమిటీలకు ఫిర్యాదు చేయాలని సూచించారు. టాలీవుడ్‌ను బ్లేమ్‌ చేసేలా మాట్లాడితే సహించేదిలేదన్నారు ముత్యాల రాందాస్‌. మరోవైపు కమిట్‌మెంట్ అడిగినప్పుడే చెప్పుతో ఎందుకు కొట్టలేదు నట్టికుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దంగల్ మూవీ నటి ఫాతిమాషేక్ కామెంట్స్‌పై టాలీవుడ్‌ ప్రముఖులు ఫైర్‌
Heroin Fatima
Follow us
K Sammaiah

|

Updated on: Feb 02, 2025 | 1:23 PM

సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌ అంశం మళ్లీ కలకలం రేపుతోంది. దంగల్ మూవీ నటి ఫాతిమాషేక్ కామెంట్స్‌పై టాలీవుడ్‌ ప్రముఖులు ఫైర్‌ అవుతున్నారు. తాజాగా.. టాలీవుడ్‌లో క్యా్స్టింగ్‌ కౌచ్‌ వివాదంపై నిర్మాత ముత్యాల రాందాస్‌ రియాక్ట్‌ అయ్యారు. కోరికలు తీరిస్తేనే ఛాన్సులు అని టాలీవుడ్‌పై ఆరోపణలు చేయడం కరెక్ట్‌ కాదన్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే టాలీవుడ్‌లోని ప్రత్యేక కమిటీలకు ఫిర్యాదు చేయాలని సూచించారు. టాలీవుడ్‌ను బ్లేమ్‌ చేసేలా మాట్లాడితే సహించేదిలేదన్నారు ముత్యాల రాందాస్‌.

మరోవైపు కమిట్‌మెంట్ అడిగినప్పుడే చెప్పుతో ఎందుకు కొట్టలేదు నట్టికుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కమిట్‌మెంట్‌ అడినప్పుడు చెప్పుతో ఎందుకు కొట్టలేదని నట్టికుమార్‌ ప్రశ్నించారు. ఒక ఇండస్ట్రీపై అభాండాలు వేయడం కరెక్ట్‌ కాదన్నారు నట్టికుమార్‌. ఆరోపణలు చేయడం కాదు.. పేర్లు బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. ఫిర్యాదులు చేయకుండా కామెంట్స్‌ చేయడమేంటననారు. ఇష్టారీతి వ్యాఖ్యలతో ఇండస్ట్రీని అవమానపరచవద్దని నట్టికుమార్‌ అన్నారు.

సౌత్‌ సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌ గురించి బాలీవుడ్‌ నటి ఫాతిమా సనా షేక్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఓ యూ ట్యూబ్‌ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. దంగల్ సినిమాలో గీతా ఫోగట్ పాత్రలో నటించారు ఫాతిమా. ఆమిర్‌ ఖాన్‌ నటించిన ‘దంగల్‌’ సినిమాతో తెరంగేట్రం చేసిన ఫాతిమా సనా షేక్‌ తన కెరీర్‌ తొలినాళ్లలో ఎదురైన కాస్టింగ్‌ కౌచ్‌ అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో తాజాగా పంచుకున్నారు. ‘ఓ సినిమా కోసం ఆడిషన్‌కు వెళ్లాను. అక్కడ మీరు ఏం చేయడానికైనా సిద్ధమేనా..? అంటూ ఓ డైరెక్టర్‌ నన్ను అడిగాడు. కష్టపడి పనిచేస్తానని.. నా పాత్ర కోసం ఏది అవసరమో అది చేస్తానని చెప్పా. కానీ, అతను మాత్రం అదే ప్రశ్న మళ్లీ మళ్లీ అడిగాడు. నేను కూడా అతడు ఎంతకు దిగజారతాడో చూద్దామని ఏమీ తెలియనట్లే ప్రవర్తించాను’ అని ఫాతిమా తనకు ఎదురైన చేదు అనుభవం గురించి తెలిపింది.

ఇక సౌత్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌ గురించి ప్రొడ్యూసర్లు ఓపెన్‌గా మాట్లాడుకుంటారని ఫాతిమా షేక్‌ పేర్కొంది. దక్షిణాది సినిమాలో అవకాశం కోసం హైదరాబాద్‌కు వచ్చినప్పుడు తనకు ఎదురైన ఓ అనుభవాన్ని ఆ ఇంటర్వ్యూలో ఫాతిమా గుర్తు చేసుకుంది. హైదరాబాద్‌లో ఓ నిర్మాతను కలిసిన అనుభవాన్ని పంచుకుంటూ.. “సౌత్‌ సినీ ఇండస్ట్రీ నిర్మాతలు కాస్టింగ్‌ కౌచ్‌ గురించి చాలా ఓపెన్‌గా మాట్లాడతారు. మీకు తెలుసా.. ఇక్కడ మీరు కొందరిని కలవాల్సి ఉంటుంది అనేవాళ్లు. ఆ విషయం నేరుగా చెప్పేవాళ్లుకాదు. ఎలా చెప్పినా వారి ఉద్దేశమైతే అదే అని తెలిసిపోయేది” అని ఫాతిమా చెప్పుకొచ్చారు. బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫాతిమా చేసిన కామెంట్స్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

మెగా టోర్నీ ముందు పాకిస్థాన్ ని చావుదెబ్బ కొట్టిన న్యూజిలాండ్..
మెగా టోర్నీ ముందు పాకిస్థాన్ ని చావుదెబ్బ కొట్టిన న్యూజిలాండ్..
టీవీ9 వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం ఫెస్టివల్‌లో దుమ్మురేపిన పెపాన్
టీవీ9 వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం ఫెస్టివల్‌లో దుమ్మురేపిన పెపాన్
శివుడికి అత్యంత ఇష్టమైన రాశులవారికి అద్భుతయోగం..వీరికే సంపదలవర్షం
శివుడికి అత్యంత ఇష్టమైన రాశులవారికి అద్భుతయోగం..వీరికే సంపదలవర్షం
కుంభమేళాలో ఫోన్ ఛార్జింగ్ బిజినెస్.. 45 రోజుల్లో లక్షాధికారి!
కుంభమేళాలో ఫోన్ ఛార్జింగ్ బిజినెస్.. 45 రోజుల్లో లక్షాధికారి!
మీకు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందా? కారణం ఇదే..!
మీకు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందా? కారణం ఇదే..!
హ్యాపీగా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.. ఇదేం పని...
హ్యాపీగా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.. ఇదేం పని...
తమన్‏కు ప్రేమతో బాలయ్య గిఫ్ట్..
తమన్‏కు ప్రేమతో బాలయ్య గిఫ్ట్..
బుమ్రా లేకున్నా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచే సత్తా టీమిండియాకు ఉందా?
బుమ్రా లేకున్నా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచే సత్తా టీమిండియాకు ఉందా?
జియో మార్ట్‌లో బంపర్‌ ఆఫర్‌..వేసవి రాకముందే ఏసీలపై భారీ డిస్కౌంట్
జియో మార్ట్‌లో బంపర్‌ ఆఫర్‌..వేసవి రాకముందే ఏసీలపై భారీ డిస్కౌంట్
2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపు వెనుక ధోని మాస్టర్ మైండ్!
2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపు వెనుక ధోని మాస్టర్ మైండ్!