దీపావళి నుండి సినిమా ప్రదర్శనలు : ఎగ్జిబిటర్స్
తూర్పుగోదావరి జిల్లాలో వచ్చే దీపావళి నుండి థియేటర్లలో సినిమా ప్రదర్శనలు ప్రారంభించాలని తీర్మానించారు. కాకినాడ లక్ష్మీ థియేటర్‌లో జరిగిన జిల్లా ఫిలిమ్ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈసందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈనెల 15 నుండి సినిమా ప్రదర్శనలకు అనుమతించడం జరిగిందని, ఇందుకు తమ కృతజ్ఞతలని తెలియజేశారు. అయితే, కొన్ని సాంకేతిక కారణాలతో థియేటర్లు తెరవడం ప్రస్తుతం సాధ్యం కావడం లేదని, సినీ నిర్మాతల సహకారంతో దీపావళికి […]

తూర్పుగోదావరి జిల్లాలో వచ్చే దీపావళి నుండి థియేటర్లలో సినిమా ప్రదర్శనలు ప్రారంభించాలని తీర్మానించారు. కాకినాడ లక్ష్మీ థియేటర్‌లో జరిగిన జిల్లా ఫిలిమ్ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈసందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈనెల 15 నుండి సినిమా ప్రదర్శనలకు అనుమతించడం జరిగిందని, ఇందుకు తమ కృతజ్ఞతలని తెలియజేశారు. అయితే, కొన్ని సాంకేతిక కారణాలతో థియేటర్లు తెరవడం ప్రస్తుతం సాధ్యం కావడం లేదని, సినీ నిర్మాతల సహకారంతో దీపావళికి థియేటర్లు తెరిచేందుకు నిర్ణయించామని తెలిపారు.
లాక్ డౌన్ సమయంలో థియేటర్ల విద్యుత్ ఫిక్సెడ్ చార్జీలు మాఫీ చేస్తామని సినీ పెద్దల సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. సమావేశంలో అత్తి సత్యనారాయణ, లక్ష్మీ థియేటర్ శ్రీను, గీతా వెంకటేశ్వరరావు, జేకే రామకృష్ణ, పిఠాపురం పెదబాబు, చినబాబు, గౌరీశంకర్, హరిబాబు, స్వామి బాబు, చిన్ని తదితరులు పాల్గొన్నారు.



