సీఐడీ అదుపులో మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ పీఏ..
ఆంధ్రప్రదేశ్ మాజీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పీఏ సాంబమూర్తిని హైదరాబాద్ లో సిఐడి అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్‌లోని ఏపీ సీఐడీ ఆఫీసులో అతడిని విచారిస్తున్నారు. కేంద్ర హోంశాఖకు రమేష్ కుమార్ రాసిన లేఖపై సిఐడి విచారణ జరుపుతోంది. తనకు రక్షణ కల్పించాలంటూ నిమ్మగడ్డ కేంద్రానికి రాసిన లేఖ తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య అప్పట్లో మాటల యుద్దం కొనసాగింది. లేఖకు సంబంధించి ఇప్పటికే కొన్ని ఆధారాలు […]

ఆంధ్రప్రదేశ్ మాజీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పీఏ సాంబమూర్తిని హైదరాబాద్ లో సిఐడి అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్‌లోని ఏపీ సీఐడీ ఆఫీసులో అతడిని విచారిస్తున్నారు. కేంద్ర హోంశాఖకు రమేష్ కుమార్ రాసిన లేఖపై సిఐడి విచారణ జరుపుతోంది.
తనకు రక్షణ కల్పించాలంటూ నిమ్మగడ్డ కేంద్రానికి రాసిన లేఖ తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య అప్పట్లో మాటల యుద్దం కొనసాగింది. లేఖకు సంబంధించి ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించామని సిఐడి చీఫ్ చెప్తోన్న సంగతి తెలిసిందే. అసలు రమేశ్ కుమార్ ఆ లేఖ తన సమ్మతంతోనే పంపించారా..? బయట నుంచి వచ్చిందా అనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ కోణంలో సదరు లేఖ నిమ్మగడ్డ పీఏ సాంబమూర్తికి వచ్చిందనే సమాచారంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.