Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముఖ్యమంత్రుల ముందుకు మెగాస్టార్ ప్రతిపాదన

మెగాస్టార్ చిరంజీవి చేసిన ఓ విఙ్ఞప్తిపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరు ఎలా స్పందిస్తారన్న చర్చ మొదలైంది. తెలుగు సినీ పరిశ్రమలో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుడుతూ.. సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ కేంద్ర ప్రభుత్వం ముందు తెలుగు సినీ పరిశ్రమ తరపున ఓ డిమాండ్ పెట్టారు. అయితే ఆ డిమాండ్ ఢిల్లీ పెద్దలకు చేరాలంటే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ చూపాల్సిన పరిస్థితి. మరి తెలుగు రాష్ట్రాల సీఎంలు […]

ముఖ్యమంత్రుల ముందుకు మెగాస్టార్ ప్రతిపాదన
Follow us
Rajesh Sharma

| Edited By: Srinu

Updated on: Jan 06, 2020 | 5:14 PM

మెగాస్టార్ చిరంజీవి చేసిన ఓ విఙ్ఞప్తిపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరు ఎలా స్పందిస్తారన్న చర్చ మొదలైంది. తెలుగు సినీ పరిశ్రమలో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుడుతూ.. సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ కేంద్ర ప్రభుత్వం ముందు తెలుగు సినీ పరిశ్రమ తరపున ఓ డిమాండ్ పెట్టారు. అయితే ఆ డిమాండ్ ఢిల్లీ పెద్దలకు చేరాలంటే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ చూపాల్సిన పరిస్థితి. మరి తెలుగు రాష్ట్రాల సీఎంలు మెగాస్టార్ అభ్యర్థనను ఫార్వార్డ్ చేస్తారా అన్నదిపుడు చర్చగా మారింది.

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన సరిలేరు నీకెవ్వరు మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం ఆయన హుందాతనాన్ని చాటింది. ఎంతో కాలంగా సీనియర్ నటి విజయశాంతితో వున్న విభేదాలను రూపు మాపుకునేందుకు ట్రై చేసిన చిరంజీవి.. అదే క్రమంలో టాలీవుడ్ పెద్దగా కేంద్రానికి మరో విఙ్ఞప్తి చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సాహాసాలు, ప్రయోగాలు చేసిన సీనియర్ సూపర్ స్టార్, నట శేఖర కృష్ణకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలని చిరంజీవి సరిలేరు నీకెవ్వరు వేదిక నుంచి కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు.

చిరంజీవి చేసిన ఈ ప్రతిపాదనకు ఎల్బీ స్టేడియంలో సభకు హాజరైన మెగాస్టార్, సూపర్ స్టార్ అభిమానులు కేరింతలతో ఆమోదం తెలిపారు. అయితే.. ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకు వెళ్ళాల్సిన బాధ్యత తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలపై వుంది. ముఖ్యమంత్రుల్లో ఏ ఒక్కరో.. లేక ఇద్దరో దీనికి అనుకూలంగా కేంద్రానికి కృష్ణ పేరును ఫాల్కే అవార్డుకు ప్రతిపాదించాల్సి వుంటుంది. అప్పుడే ఈ ప్రతిపాదనపై కేంద్రం పరిశీలన జరిపే అవకాశం వుంది.

మరి తెలుగు సీఎంలు చిరంజీవి ప్రతిపాదనను, విఙ్ఞప్తిని ఏ మేరకు పరిశీలిస్తారు? పరిశీలించి కేంద్రానికి పంపుతారు? ఈ ప్రశ్నలిపుడు టాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. వీటికి సమాధానం రావాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.