విగ్రహాల విధ్వంసంపై చిన జీయర్ స్వామి ఆగ్రహం.. ఈనెల 17 నుంచి దాడులు జరిగిన ప్రాంతాల్లో పర్యటిస్తానని ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల్లో జరుగుతున్న వరుస దాడి ఘటనలపై త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయాల్లో రక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు..

విగ్రహాల విధ్వంసంపై చిన జీయర్ స్వామి ఆగ్రహం.. ఈనెల 17 నుంచి దాడులు జరిగిన ప్రాంతాల్లో పర్యటిస్తానని ప్రకటన
Follow us

|

Updated on: Jan 05, 2021 | 5:03 PM

Chinna Jeeyar Swamy : ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల్లో జరుగుతున్న వరుస దాడి ఘటనలపై త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయాల్లో రక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని విజయ కీలాద్రిపై చిన జీయర్ స్వామీజీ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఉపద్రవాలు జరిగినపుడు ఉపశమనం కల్పించడంతోపాటు తక్షణ కర్తవ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఏపీలో ఆలయాల ఉనికికి భంగం కలుగుతున్నపుడు మౌనంగా ఉండటం సరైంది కాదని అనిపించిందని… అందుకే.. ధనుర్మాసం పూర్తికాగానే ఓ క్రమంలో ఏయే ఆలయాలపై దాడులు జరిగాయో.. వాటన్నింటినీ సందర్శిస్తానని ఆయన ప్రకటించారు. ఈనెల 17వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా యాత్రను చేపట్టనున్నట్లు చిన జీయర్ స్వామి వెల్లడించారు. ఆ సమయంలో అక్కడి ప్రజలతో మాట్లాడుతాను అని అన్నారు. అయితే ఏ ప్రాంతం నుంచి యాత్ర చేపట్టాలన్నది మాత్రం ఇంకా నిర్ణయించలేదని, త్వరలోనే నిర్ణయించుకుంటామని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఇంటిలిజెన్స్ విభాగంతో స్పష్టమైన కమిటీ వేసి విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇలాంటి దాడులు చర్చి, మసీదులపై జరిగినా కూడా తీవ్రంగా స్పందించాలని కోరారు. దేవాలయం స్థానంలో చర్చి కానీ, మసీదు కానీ ఉంటే ప్రపంచం మొత్తం కదిలేదని, ఆలయాలను ఆసరాగా చేసుకొని జీవించే వారు శాంతియుతంగా ఉంటారని త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి పేర్కొన్నారు.

కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే