కరోనా వైరస్ ‘పుట్టుక’ పై ప్రపంచానికి చాటిన చైనా మాజీ లాయర్ కు నాలుగేళ్ల జైలుశిక్ష, అల్లర్లను రెచ్ఛగొట్టిందట

కరోనా వైరస్ తొలినాళ్లలో దీని 'ఆవిర్భావం' గురించి విదేశాలకు చాటిన మాజీ లాయర్ కు చైనా నాలుగేళ్ళ జైలుశిక్ష విధించింది.  దేశంలో ఆమె అల్లర్లను రెచ్ఛగొడుతోందని, కయ్యాలను కావాలనే ప్రోత్సహిస్తోందని ఆరోపించింది.

కరోనా వైరస్ 'పుట్టుక' పై ప్రపంచానికి చాటిన  చైనా మాజీ లాయర్ కు నాలుగేళ్ల జైలుశిక్ష, అల్లర్లను రెచ్ఛగొట్టిందట
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 28, 2020 | 6:09 PM

కరోనా వైరస్ తొలినాళ్లలో దీని ‘ఆవిర్భావం’ గురించి విదేశాలకు చాటిన మాజీ లాయర్ కు చైనా నాలుగేళ్ళ జైలుశిక్ష విధించింది.  దేశంలో ఆమె అల్లర్లను రెచ్ఛగొడుతోందని, కయ్యాలను కావాలనే ప్రోత్సహిస్తోందని ఆరోపించింది. జాంగ్ జాన్ అనే ఈ మాజీ లాయర్..విదేశీ మీడియాకు ఇస్తున్న ఇంటర్వ్యూలలో తప్పుడు సమాచారం ఇస్తోందని అధికారులు అంటున్నారు. షాంగై లోని కోర్టు ఈమెకు 4 ఏళ్ళ జైలు శిక్ష విధిస్తు తీర్పు చెప్పింది. అయితే ఈ తీర్పుపై అప్పీలు చేస్తావా అని ప్రశ్నించగా ఆమె మౌనం వహించింది. 37 ఏళ్ళ జాంగ్ జాన్ గత ఫిబ్రవరిలో వూహన్ సిటీకి వచ్చి.. ఇలా దేశంలో తలెత్తిన ఔట్ బ్రేక్ గురించి సోషల్  మీడియాలో ‘ రచ్ఛ’ చేసిందట.. విదేశీ మీడియాకు అదే పనిగా ఇంటర్వ్యూలు ఇచ్చిందట. గత మే నెలలో ఈమెను అరెస్టు చేశారు. కరోనా వైరస్ కు సంబంధించిన సమాచారం పై చైనాలో సెన్సార్ షిప్ ఉంది. ఇష్టం వఛ్చినట్టు ఎవరూ మాట్లాడకూడదన్న ఆంక్షలున్నాయి. కానీ ఈ లాయరమ్మ మాత్రం దీన్ని పట్టించుకోకపోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్బంధంలో ఉండగా ఈమె నిరాహార దీక్షలు చేసిందని, ఆహారం ముట్టకపోడంతో అధికారులే బలవంతంగా తినిపించారని తెలిసింది.

చైనా పాలక కమ్యూనిస్టు పార్టీ మీడియాను  అదుపులో ఉంచుకోవడం విశేషం, ఒకపుడు డాక్టర్లలో ఒకరైన లీ వెన్ లియాంగ్ కరోనా వైరస్ బారిన  పడి మరణించారు.