AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాస్క్ ధరించనందుకు చిలీ దేశ అధ్యక్షుడికి ఫైన్.. పొరపాటుకు క్షమాపణలు చెప్పిన పినెరా

కరోనా సమయంలో పక్కాగా మాస్కు ధరించాలన్న నిబంధనను పాటించనందుకు ఓ దేశాధ్యక్షుడికే ఫైన్ పడింది. అంతే కాదు భారీగా ఫైన్ కూడా చెల్లించాల్సి వచ్చింది.

మాస్క్ ధరించనందుకు చిలీ దేశ అధ్యక్షుడికి ఫైన్.. పొరపాటుకు క్షమాపణలు చెప్పిన పినెరా
Sanjay Kasula
|

Updated on: Dec 20, 2020 | 7:28 PM

Share

కరోనా నిబంధనలు పాటించకుంటే ఎంతటివారికైన తిప్పలు తప్పడం లేదు. కరోనా సమయంలో పక్కాగా మాస్కు ధరించాలన్న నిబంధనను పాటించనందుకు ఓ దేశాధ్యక్షుడికే ఫైన్ పడింది. అంతే కాదు భారీగా ఫైన్ కూడా చెల్లించాల్సి వచ్చింది.

చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినెరా ఇటీవల ఓ బీచ్‌కు వెళ్లారు. అక్కడ ఓ మహిళ అభిమానితో సెల్ఫీ దిగిన సమయంలో మాస్కు లేకుండా కనిపించారు. అది కాస్తా సోషల్ మీడియాలో నెటిజన్లు దృష్టిలో పడింది. ఇంకేముందు ఆ ఫోటో పెద్ద ఎత్తున వైరల్‌గా మారింది.

దీంతో ఆయన అక్కడి ప్రభుత్వం నోటీసు కూడా పంపించింది. దీంతో ఆయన దాదాపు 2 లక్షల 57 వేల జరిమానా చెల్లించాల్సి వచ్చింది. అంటేకాదు తన వల్ల జరిగిన పొరపాటును ఆయన అంగీకరిస్తూ దేశ ప్రజలకు క్షమాపణలు కూడా చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించకపోతే ఈ చిన్న దేశంలోనూ ఫైన్, జైలు శిక్షలను అమలు చేస్తున్నారు.