అన్నదాతకు ఉచిత పంటల బీమా చెల్లింపు..రైతన్నకు కొండంత అండగా రాష్ట్ర సర్కార్..

రైతన్నకు అండగా నిలిచింది ఏపీ ప్రభుత్వం. ఆరుగాలం కష్టపడి తీరా పంట చేతికొచ్చే సమయానికి అతివృష్టి, అనావృష్టి, వరదలు, కరవు కాటకాలు, చీడపీడలు ఇతర ప్రకృతి వైపరీత్యాలతో కలిగే పంట దిగుబడి..

అన్నదాతకు ఉచిత పంటల బీమా చెల్లింపు..రైతన్నకు కొండంత అండగా రాష్ట్ర సర్కార్..
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 15, 2020 | 1:23 AM

Crop Insurance Payments : రైతన్నకు అండగా నిలిచింది ఏపీ ప్రభుత్వం. ఆరుగాలం కష్టపడి తీరా పంట చేతికొచ్చే సమయానికి అతివృష్టి, అనావృష్టి, వరదలు, కరవు కాటకాలు, చీడపీడలు ఇతర ప్రకృతి వైపరీత్యాలతో కలిగే పంట దిగుబడి నష్టాలతో కుదేలవుతున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కొండంత అండలా నిలుస్తోంది.

సుదీర్ఘ 3648 కి.మీ పాదయాత్రలో రైతుల కష్టాలు, కడగండ్లు స్వయంగా చూసిన సీఎం వైఎస్‌‌ జగన్, ఆనాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు. ఆ మేరకు రైతులను ఆదుకునే విధంగా ‘డాక్టర్‌ వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా’ పథకాన్ని అమలు చేస్తున్నారు.

2019 సీజన్‌లో పలు కారణాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం వారికి బీమా పరిహారం అందజేస్తోంది. అందులో భాగంగా మంగళవారం 9.48 లక్షల రైతులకు ఏకంగా రూ.1252 కోట్ల పరిహారం అందుతోంది. క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆ మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.