AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ration ATM: రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. మీ కోసమే ఈ కొత్త ఏటీఎం.. ఎలా పనిచేస్తుందంటే?

ఇన్నాళ్లు కేవలం ఏటీఎం ద్వారా డబ్బులు మాత్రమే తీసుకునేవారు. కానీ కాలం మారింది టెక్నాలజీ వేగంగా అభివృద్ది చెందుతోంది. ఇదే టెక్నాలజీని వాడి దేశంలోని తోటి ‘గ్రెయిన్ ఏటీఎం’ను( రేషన్ ఏటీఎం) చత్తీస్‌ఘడ్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. 24 గంటల పాటు ప్రజలకు రేషన్ అందించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ కొత్త ఏటీఎంను వైశాలీ నగర్‌లో రికేష్ సేన్ బుధవారం ప్రారంభించారు.

Ration ATM: రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. మీ కోసమే ఈ కొత్త ఏటీఎం.. ఎలా పనిచేస్తుందంటే?
First Grain Atm Opened In Chhattisgarh
Anand T
|

Updated on: Aug 13, 2026 | 9:17 AM

Share

దేశంలోని తొలి ధాన్యం ఏటీఎంను చత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం విజయవంతంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. బధవారం వైశాలీ నగర్‌లో ఎమ్మెల్యే రికేష్ సేన్ ఈ ఏటీఎంను అధికారికంగా ప్రారంభించారు. ఈ గ్రెయిన్ ఏటీఎం పూర్తి ఆటోమేటెడ్ విధానంలో పనిచేస్తుందని అధికారులు తెలిపారు. అర్హులైన లబ్ధిదారులు తమ రేషన్ కార్డ్ లేదా ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేసి.. బయోమెట్రిక్ పూర్తయిన తర్వాత ఈ ఏటీఎం నుంచి ధాన్యం పొందవచ్చని తెలిపారు.

బ్యాంకింగ్ ఏటీఎంల మాదిరిగానే ఈ ధాన్యం ఏటీఎం కూడా 24/7 అందుబాటులో ఉంటుందని, లబ్ధిదారులు తమ అవసరాలకు బట్టి ఏటీఎం నుంచి రేషన్‌ను తీసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ ఏటీఎం రాకతో రేషన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని, డీలర్లు, మధ్యవర్తుల దోపిడీ తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. దీని వల్ల అక్రమాలు జరగకుండా అరికట్ట వచ్చని స్థానిక ఎమ్మెల్యే సేన్ అన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అలాగే రాబోయే రోజుల్లో పంచదార.. ఇతర నిత్యావసర సరుకుల కోసం కూడా ఇలాంటి ఏటీఎంలు తీసుకువచ్చేందుకు ఆలోచిస్తున్నామన్నారు. కాబట్టి ఈ ఏటీఎం ఎలా పనిచేస్తుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని.. ఇది పేదలకు ఎంతో మేలు చేస్తుందని ఆయన అన్నారు. ఇకపై మధ్యవర్తుల హవా చెల్లదు, అవినీతి అంతమవుతుంది అని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు.

ఈ ఏటీఎం e-PoS యంత్రంతో లింక్ చేయబడి ఉంటుందని.. లబ్ధిదారులు తమ రేషన్ కార్డ్ నంబర్‌ను నమోదు చేసి, బయోమెట్రిక్ థంబ్ స్కాన్ ద్వారా ప్రక్రియ పూర్తి చేసిన వెంటనే ధాన్యాలు లభిస్తాయని అధికారులు తెలిపారు. అంతేకాదు ఇందులోనే వెయిట్ మిషన్ ఉంటుందని.. తద్వారా లబ్ధిదారులు తమకు వచ్చిన ధాన్యాల బరువును కూడా సరిచూసుకోవచ్చని తెలిపారు. స్థానికులకే కాదు.. ఇతర జిల్లాలు, రాష్ట్రాల వారు కూడా ఈ ఏటీఎం ద్వారా బియ్యాన్ని పొందవచ్చని అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బ్రేక్ డ్యాన్స్‏తో టాలీవుడ్‏ను షేక్ చేసిన హీరోయిన్..
బ్రేక్ డ్యాన్స్‏తో టాలీవుడ్‏ను షేక్ చేసిన హీరోయిన్..
ఏసీ కోచ్‌లో మీకు బెడ్ షీట్ ఇవ్వలేదా..? ఇలా చేస్తే రీఫండ్..
ఏసీ కోచ్‌లో మీకు బెడ్ షీట్ ఇవ్వలేదా..? ఇలా చేస్తే రీఫండ్..
నాగుపాము పడగపై కనిపించే ఆ సింబల్ ఏంటి?
నాగుపాము పడగపై కనిపించే ఆ సింబల్ ఏంటి?
రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. మీ కోసమే ఈ కొత్త ఏటీఎం
రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. మీ కోసమే ఈ కొత్త ఏటీఎం
వైట్‌ బాల్‌తో హీరో.. రెడ్ బాల్‌తో జీరో.. టీమిండియా పాలిట విలన్..?
వైట్‌ బాల్‌తో హీరో.. రెడ్ బాల్‌తో జీరో.. టీమిండియా పాలిట విలన్..?
తెలంగాణలో MBBS, BDS ఫీజులు ఖరారు.. 4 ఏళ్ల పాటు పాత ఫీజులే..
తెలంగాణలో MBBS, BDS ఫీజులు ఖరారు.. 4 ఏళ్ల పాటు పాత ఫీజులే..
హీరోగా విమర్శలు.. డైరెక్టర్‏గా బ్లాక్ బస్టర్ హిట్స్.. ఎవరో గుర్తు
హీరోగా విమర్శలు.. డైరెక్టర్‏గా బ్లాక్ బస్టర్ హిట్స్.. ఎవరో గుర్తు
IRCTC: హైదరాబాద్ నుంచి అండమాన్‌కు 7 రోజుల టూర్.. బరాటాంగ్ సహా..
IRCTC: హైదరాబాద్ నుంచి అండమాన్‌కు 7 రోజుల టూర్.. బరాటాంగ్ సహా..
ఎన్నో కళలలో ప్రపంచాన్ని చుట్టేదామని బయల్దేరింది..గమ్యం చేరకుండానే
ఎన్నో కళలలో ప్రపంచాన్ని చుట్టేదామని బయల్దేరింది..గమ్యం చేరకుండానే
మొబైల్ ద్వారా రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేయడం ఎలా..?
మొబైల్ ద్వారా రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేయడం ఎలా..?