మెగాస్టార్‌పై అనుచిత వ్యాఖ్యలు.. ఆ ఎమ్మెల్యే ఏమన్నారంటే..?
మెగాస్టార్ చిరంజీవిపై సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టింగులు ఓ వైసీపీ ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారాయి. చివరికి తానే స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఇంతకీ ఆ పోస్టులేవంటారా ..? ఇది చదవండి.. ముఖ్యమంత్రి జగన్‌తో చిరంజీవి భేటీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరుతో ఓ ఫేస్‌బుక్ పోస్ట్ వైరల్ అయింది. ఆ పోస్ట్ మెగా అభిమానులకు విపరీతమైన కోపం తెప్పించింది. వెంటనే సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. […]
మెగాస్టార్ చిరంజీవిపై సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టింగులు ఓ వైసీపీ ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారాయి. చివరికి తానే స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఇంతకీ ఆ పోస్టులేవంటారా ..? ఇది చదవండి..
ముఖ్యమంత్రి జగన్‌తో చిరంజీవి భేటీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరుతో ఓ ఫేస్‌బుక్ పోస్ట్ వైరల్ అయింది. ఆ పోస్ట్ మెగా అభిమానులకు విపరీతమైన కోపం తెప్పించింది. వెంటనే సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. వివాదం ముదురుతుండడంతో ఈ వివాదంపై ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. మెగాస్టార్ చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యల పోస్టులకు, తనకూ ఎలాంటి సంబంధం లేదన్నారు. తన ఫ్యాన్స్‌గా చెప్పుకుంటున్న కొందరు చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
తనకు అభిమాన సంఘాలు లేవని, తన పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెవిరెడ్డి పేర్కొన్నారు. తనకి అసలు ట్విటర్, ఫేస్‌బుక్ అకౌంట్లే లేవని చెవిరెడ్డి తెలిపారు. చిరంజీవితో తనకు సత్సంబంధాలే ఉన్నాయన్నారు. తాను తుడా చైర్మన్‌గా ఉన్నప్పుడు చిరంజీవి తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నారని, అప్పటి నుంచి మంచి సంబంధాలే ఉన్నాయన్నారు చెవిరెడ్డి. ఎవరో చేసిన పనులకు గౌరవప్రదమైన స్థానంలో వున్న వారు వివరణ ఇచ్చుకోవాల్సిన దుస్థితి రావడం బాధాకరమన్నారాయన.