AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mangoes: ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు..

వేసవి వచ్చిందంటే మామిడి పండ్ల సీజన్ మొదలవుతుంది. కానీ ఇప్పుడు మార్కెట్‌లో కనిపిస్తున్న మెరిసే మామిడిపండ్ల వెనుక ప్రమాదకర నిజాలు బయటపడుతున్నాయి. కృష్ణాజిల్లాలో రసాయనాలతో గంటల్లోనే మగ్గించిన మామిడిపండ్లు భారీగా విక్రయిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ఆరోగ్యానికి హానికరమైన కెమికల్స్‌తో పండ్లను మగ్గపెట్టి మార్కెట్‌లోకి పంపిస్తున్నారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

Mangoes: ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు..
Mangoes
M Sivakumar
| Edited By: |

Updated on: May 11, 2026 | 5:08 PM

Share

వేసవి వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చేది మామిడి పండ్లే. కానీ ఇప్పుడు అదే మామిడి ప్రజల్లో భయాన్ని పెంచుతోంది. మార్కెట్‌లో బంగారంలా మెరిసే మామిడిపండ్ల వెనుక అసలు నిజం బయటపడుతోంది. సహజంగా చెట్టుపైన మగ్గాల్సిన మామిడి కాయలను… గోదాముల్లో రసాయనాలతో గంటల్లోనే పసుపురంగులోకి మార్చి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు.

కృష్ణాజిల్లాలో భారీగా సాగుతున్న ఈ కెమికల్ మామిడి దందా ఇప్పుడు ప్రజారోగ్యానికి ముప్పుగా మారింది. బయటకు ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ పండ్లు లోపల మాత్రం ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతున్నాయంటున్నారు వైద్యులు. రోజుల గడిచేకొద్దీ సహజంగా మగ్గాల్సిన మామిడికాయలను.. రాత్రివేళ గోదాముల్లో నిల్వ చేసి రసాయనాల మధ్య కప్పిపెట్టి ఉంచుతున్నారు. తెల్లారేసరికి అవే పండ్లు సహజంగా మగ్గిన మామిడిపండ్ల పేరుతో మార్కెట్‌లోకి చేరుతున్నాయి. రంగు, మెరుపు చూసి ప్రజలు కొనుగోలు చేస్తున్నా.. వాటి వెనుక దాగి ఉన్న ప్రమాదం చాలామందికి తెలియడం లేదు..

సహజంగా మగ్గిన పండ్లకు ఉండే వాసన, రుచి, నాణ్యత ఈ కెమికల్ పండ్లలో కనిపించడం లేదని వినియోగదారులు చెబుతున్నారు. అయినా తక్కువ సమయంలో ఎక్కువ లాభాల కోసం కొందరు వ్యాపారులు ప్రజల ఆరోగ్యాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ రసాయనాలతో మగ్గించిన పండ్లు తింటే కడుపునొప్పి, వాంతులు, అలర్జీలు, జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని చెబుతున్నారు..

మరో వైపు ఫుడ్ సేఫ్టీ నిబంధనల ప్రకారం ప్రమాదకర రసాయనాలతో పండ్లను మగ్గపెట్టడం నిషేధం. అయినా కొన్ని గోదాముల్లో యథేచ్ఛగా ఈ ప్రక్రియ కొనసాగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అధికారుల తనిఖీలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.. అందుకే బయట దొరికే మామిడి పండ్లు కొనేముందు జర భద్రం. బదులకు మీకు తెలిసిన తోటలు ఉంటే అక్కడకు వెళ్లి తెచ్చుకోవడం ఉత్తమం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us