UPI Payments: యూపీఐ, రూపే కార్డ్‌ లావాదేవీలకు చార్జీలు వసూలు చేస్తుండడంపై రంగంలోకి దిగిన సీబీడీటీ.. వివరణ ఇవ్వాలంటూ..

Charges On UPI Payments: దేశంలో డిజిటల్‌ చెల్లింపులు పెరిగిన నేపథ్యంలో యూపీఐ, రూపే కార్డ్‌ లావాదేవీలు ఎక్కువయ్యాయి. అయితే వీటిపై ఇప్పటి వరకు అటు బ్యాంకులు కానీ ఇటు డిజిటల్‌ వ్యాలెట్‌ యాప్‌లు కానీ ఎలాంటి చార్జీలు వసూలు చేయడం లేదు...

UPI Payments: యూపీఐ, రూపే కార్డ్‌ లావాదేవీలకు చార్జీలు వసూలు చేస్తుండడంపై రంగంలోకి దిగిన సీబీడీటీ.. వివరణ ఇవ్వాలంటూ..
Follow us

|

Updated on: Jan 15, 2021 | 12:07 AM

Charges On UPI Payments: దేశంలో డిజిటల్‌ చెల్లింపులు పెరిగిన నేపథ్యంలో యూపీఐ, రూపే కార్డ్‌ లావాదేవీలు ఎక్కువయ్యాయి. అయితే వీటిపై ఇప్పటి వరకు అటు బ్యాంకులు కానీ ఇటు డిజిటల్‌ వ్యాలెట్‌ యాప్‌లు కానీ ఎలాంటి చార్జీలు వసూలు చేయడం లేదు. దీనిపై ప్రభుత్వం కూడా కచ్చితంగా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ పలు పేమెంట్‌ గేట్‌వే సర్వీస్‌ ప్రొవైడర్లు చార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారంపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) స్పందించింది. వెంటనే చార్జీల వసూలుపై వివరణ ఇవ్వాలని సర్వీస్‌ ప్రొవైడర్లను కోరింది. యూపీఐ, రూపే కార్డు లావాదేవీలపై వసూలు చేసిన చార్జీలను తిరిగి చెల్లించాలని గతేడాది ఆగస్టులో అన్ని బ్యాంకులను సీబీడీటీ ఆదేశించిన విషయం తెలిసిందే. యూపీఐ, రూపే కార్డు మాధ్యమాల్లో చెల్లింపులకు చార్జీలు వసూలు చేయరాదని 2019 డిసెంబర్‌లో కేంద్రం ఆదేశాలు జారీచేసింది. ఇదిలా ఉంటే పేమెంట్‌ సదుపాయం కల్పిస్తున్న వారికి పరిహారం చెల్లించకుండా చార్జీల వసూలుపై నిషేధం విధించటాన్ని బ్యాంకులు తప్పుబడుతున్నాయి. ఈ క్రమంలోనే పేమెంట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధికి ఫండ్‌ ఏర్పాటు చేస్తున్నట్టు రిజర్వ్‌బ్యాంకు గత వారం ప్రకటించింది. చిరు వర్తకులకు మాత్రమే ఉచితంగా సేవలు అందించగలమని సర్వీస్‌ ప్రొవైడర్లు చెబుతున్నారు. చూడలి మరి ఈ డిజిటల్‌ చెల్లింపులు వ్యవహారం ఎక్కడి వరకు వెలుతుందో.

Also Read: Republic Day Sales: గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారీ ఆఫర్లను ప్రకటించిన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌