చంద్రబాబు మా కుటుంబంపై కక్ష కట్టారు: మోహన్ బాబు

హైదరాబాద్: నటులు మోహన్ బాబు చేపట్టిన ధర్నా చినికి చినికి గాలివానలా మారుతుంది. నిన్న టీడీపీ నేతలు చేసిన విమర్శలకు మంచు ఫ్యామిలీ కౌంటరిచ్చింది. దీనికి సంబంధించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఫీజు రింబర్స్‌మెంట్‌ కింద ప్రభుత్వం నుంచి రూ. 19 కోట్ల రూపాయిలు రావాల్సి ఉందని, వాటిని విడుదల చేయాలని మంచు ఫ్యామిలీ డిమాండ్ చేసింది. చంద్రబాబును టార్గెట్ చేస్తూ ట్విట్టర్ వేదికగా మోహన్ బాబు మండిపడ్డారు. చంద్రబాబు తమ కుటుంబంపై కక్ష కట్టారని […]

  • Ram Naramaneni
  • Publish Date - 7:02 pm, Sun, 24 March 19
చంద్రబాబు మా కుటుంబంపై కక్ష కట్టారు: మోహన్ బాబు

హైదరాబాద్: నటులు మోహన్ బాబు చేపట్టిన ధర్నా చినికి చినికి గాలివానలా మారుతుంది. నిన్న టీడీపీ నేతలు చేసిన విమర్శలకు మంచు ఫ్యామిలీ కౌంటరిచ్చింది. దీనికి సంబంధించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఫీజు రింబర్స్‌మెంట్‌ కింద ప్రభుత్వం నుంచి రూ. 19 కోట్ల రూపాయిలు రావాల్సి ఉందని, వాటిని విడుదల చేయాలని మంచు ఫ్యామిలీ డిమాండ్ చేసింది.

చంద్రబాబును టార్గెట్ చేస్తూ ట్విట్టర్ వేదికగా మోహన్ బాబు మండిపడ్డారు. చంద్రబాబు తమ కుటుంబంపై కక్ష కట్టారని మోహన్ బాబు అన్నారు. తనను రెచ్చగొడితే జరిగిన ఘోరాలు బయటపెడతానని ట్విట్టర్‌లో మోహన్ బాబు రాసుకొచ్చారు. కమాన్ ఫర్ ది డిబేట్.. యూ అండ్ మీ అంటూ చంద్రబాబుకు మోహన్ బాబు సవాల్ విసిరారు.

మరోవైపు మోహన్ బాబు విద్యా సంస్థలకు రూ. 6 కోట్లను మాత్రమే చెల్లించాల్సి ఉందని ప్రభుత్వం అంటోంది. శ్రీ విద్యా నికేతన్‌కు రూ. 95 కోట్లను చెల్లించాల్సి ఉండగా ఇప్పటికే రూ. 88 కోట్లు విడుదలయ్యాయని ప్రభుత్వం చెబుతోంది.