AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జన్మదిన సందర్భాన పవన్‌పై బాబు ప్రశంసల జల్లు

నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఆయన అభిమానులకు పండుగరోజు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు హోరెత్తుతున్నాయి. పలవురు సినీ, రాజకీయ నాయకులు ఆయనకు విషెస్ చెప్తూ ట్వీట్లు వేస్తున్నారు. #HappyBirthdayPawanKalyan అనే హ్యస్ ట్యాగ్ ట్విట్టర్‌లో ఇండియా వైజ్ ట్రెండింగ్  నడుస్తోంది. ఇక మాజీ సీఎం చంద్రబాబు సైతం జనసేనానికి ట్విట్టర్  వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సినీనటులుగా అశేష ప్రేక్షకాభిమానాన్ని పవన్ కల్యాణ్ సంపాదించారని చంద్రబాబు ప్రశంసించారు. విశిష్ట వ్యక్తిత్వంతో […]

జన్మదిన సందర్భాన పవన్‌పై బాబు ప్రశంసల జల్లు
Chandrababu birthday wishes to Pawan Kalyan
Ram Naramaneni
|

Updated on: Sep 02, 2019 | 1:10 PM

Share

నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఆయన అభిమానులకు పండుగరోజు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు హోరెత్తుతున్నాయి. పలవురు సినీ, రాజకీయ నాయకులు ఆయనకు విషెస్ చెప్తూ ట్వీట్లు వేస్తున్నారు. #HappyBirthdayPawanKalyan అనే హ్యస్ ట్యాగ్ ట్విట్టర్‌లో ఇండియా వైజ్ ట్రెండింగ్  నడుస్తోంది. ఇక మాజీ సీఎం చంద్రబాబు సైతం జనసేనానికి ట్విట్టర్  వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

తెలుగు సినీనటులుగా అశేష ప్రేక్షకాభిమానాన్ని పవన్ కల్యాణ్ సంపాదించారని చంద్రబాబు ప్రశంసించారు. విశిష్ట వ్యక్తిత్వంతో ఆయన ప్రజల పక్షాన నిలిచి సేవలు అందిస్తున్నారని.. నిండు నూరేళ్లు, ఆనందారోగ్యాలతో వర్థిల్లాలని కొరుకుంటున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు గతంలో పవన్ కల్యాణ్‌తో ఉన్న ఆయన ఫోటోను కూడా షేర్ చేశారు. పవన్ వైసీపీని టార్గెట్ చేస్తోన్న వేళ ఆయనపై చంద్రబాబు ఇలా ప్రశంసల వర్షం కురిపించడంతో మరోసారి పొలిటికల్ హీట్ రాజుకుంది. వారిద్దరి దోస్తీలో కొత్తేముందని వైసీపీ అంటుంటే..బర్త్ డే విషెస్‌ను కూడా అధికార పార్టీ రాద్దాంతం చేస్తుందంటూ టీడీపీ, జనసేన ఆరోపిస్తున్నాయి.