Chandrababu focus: ఆ రెండు నియోజకవర్గాలపై బాబు నజర్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రెండు నియోజకవర్గాలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ రెండు నియోజకవర్గాలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చంద్రబాబు వాటి విషయంలో తానే అన్నీ అయి, వ్యూహాత్మకంగా ఇంఛార్జ్‌లను ఎంపిక చేసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు మొదలు పెట్టారని టీడీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.

Chandrababu focus: ఆ రెండు నియోజకవర్గాలపై బాబు నజర్
Follow us

|

Updated on: Feb 22, 2020 | 5:36 PM

Chandrababu focusing two key assembly segments: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రెండు నియోజకవర్గాలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ రెండు నియోజకవర్గాలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చంద్రబాబు వాటి విషయంలో తానే అన్నీ అయి, వ్యూహాత్మకంగా ఇంఛార్జ్‌లను ఎంపిక చేసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు మొదలు పెట్టారని టీడీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.

2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలలో రెండు నియోజక వర్గాల్లో టీడీపీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. అందులో ఒకటి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ప్రాతినిధ్యం వహించిన సత్తెనపల్లి కాగా మరొకటి ఇటీవల టీడీపీ దూరమై వైసీపీ చేరువైన వల్లభనేని వంశీ ప్రాతినిధ్యం వహించిన గన్నవరం నియోజకవర్గం.

సత్తెనపల్లి.. కోడెల శివప్రసాద్ రావుకు బాగా పట్టున్న ప్రాంతం. ఆయన సారథ్యంలో ఆయన స్థాయి నేత ఒక్క టీడీపీలోనే కాకుండా ఇతర పార్టీల్లోను ఎదగని పరిస్థితి. అయితే ఆయన హఠాత్తుగా ఆత్మహత్య చేసుకుని మరణించడంతో సత్తెనపల్లిలో టీడీపీ పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఎన్నికలకు ముందే టీడీపీ నుంచి చోటామోటా లీడర్లు వైసీపీలో చేరిపోయారు. దాంతో క్యాడర్ దూరమై.. పార్టీ ప్రతిష్ట దెబ్బతినడంతో సత్తెనపల్లిలో కోడెల పరాజయం పాలయ్యారు. అయితే ఆయన మరణం తర్వాత కోడెల లేని లోటును పూడ్చే నాయకుడిని నియోజకవర్గం ఇంఛార్జ్‌గా నియమించాలని చంద్రబాబు భావించారు. ఒక దశలో కోడెల శివరామ్ పేరును పరిశీలించినా.. ప్రస్తుతం మరికొందరి పేర్లను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.

మరోవైపు వల్లభనేని వంశీ వున్నన్ని రోజులు గన్నవరం టీడీపీలో మరో పేరున్న నేత ఎదగలేదు. వంశీ మార్కు రాజకీయంతో టీడీపీ వున్నవారంతా ఆయన వర్గీయులే అన్న స్థాయిలో నడిపించారు. తీరా ఆయన పార్టీ మారితే వారంతా ఆయన వెంటే టీడీపీకి దూరమయ్యారు. ఈ నేపథ్యంలో గన్నవరం నియోజకవర్గం ఇంఛార్జ్‌గా విజయవాడ నుంచి ఓ లీడర్‌ని రంగంలోకి దింపే అవకాశాలను చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

మొత్తమ్మీద వీకెండ్ కోసం హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు సత్తెనపల్లి, గన్నవరం నియోజకవర్గాలపై కొంత వర్కౌట్ చేశారని పార్టీవర్గాలు చెప్పుకుంటున్నాయి. త్వరలోనే రెండు నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను చంద్రబాబు నియమిస్తారని వారు ఆశాభావంతో వున్నారు.

Read this: తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ పదవి రేసు రసవత్తరం TPCC Chief post race looking interesting

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?