Chaavu Kaburu Challaga: ‘చావు క‌బురు చ‌ల్లగా’ టీజర్.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఫస్ట్ గ్లింప్స్‌..!

Chaavu Kaburu Challaga: ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు కౌశిక్ పెగ‌ళ్లపాటి తెరకెక్కిస్తున్న చిత్రం 'చావు కబురు చల్లగా'...

Chaavu Kaburu Challaga: 'చావు క‌బురు చ‌ల్లగా' టీజర్.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఫస్ట్ గ్లింప్స్‌..!
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 11, 2021 | 1:19 PM

Chaavu Kaburu Challaga: ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు కౌశిక్ పెగ‌ళ్లపాటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను కొద్దిసేపటి క్రితం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘మీ ఆసుపత్రికి సిస్టర్ అంటగా..” అంటూ హీరో కార్తికేయ డైలాగులతో ట్రైలర్ మొదలై ఆద్యంతం సరదా సన్నివేశాలతో సాగుతుంది. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన లభించింది. ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.