AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టీఫెన్, శ్రీలక్ష్మి బదిలీ ఎప్పుడు ? పెండింగ్ లో ఎన్నాళ్ళు ?

తెలంగాణ నుంచి సీనియర్ ఐ పీ ఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర,ఐ ఏ ఎస్ అధికారి శ్రీలక్ష్మిలను ఏపీకి బదిలీ చేసే అంశం ఇంకా పెండింగులో నలుగుతోంది. తమను ఏపీకి బదిలీ చేయాలన్న వీరి అభ్యర్థనపై డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీపీఏటీ) ఇంకా మీనమేషాలు లెక్క పెడుతోంది. అప్పుడే దాదాపు నెలరోజులు గడిచిపోయాయి కూడా. వీరి బదిలీ వ్యవహారం మెల్లగా ఏపీ సీఎం జగన్ ప్రభుత్వానికి తలనొప్పి తెచ్చిపెడుతోంది. వీరితో బాటు ఇండియన్ […]

స్టీఫెన్, శ్రీలక్ష్మి బదిలీ ఎప్పుడు ? పెండింగ్ లో ఎన్నాళ్ళు ?
Pardhasaradhi Peri
| Edited By: |

Updated on: Jul 01, 2019 | 7:53 PM

Share

తెలంగాణ నుంచి సీనియర్ ఐ పీ ఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర,ఐ ఏ ఎస్ అధికారి శ్రీలక్ష్మిలను ఏపీకి బదిలీ చేసే అంశం ఇంకా పెండింగులో నలుగుతోంది. తమను ఏపీకి బదిలీ చేయాలన్న వీరి అభ్యర్థనపై డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీపీఏటీ) ఇంకా మీనమేషాలు లెక్క పెడుతోంది. అప్పుడే దాదాపు నెలరోజులు గడిచిపోయాయి కూడా. వీరి బదిలీ వ్యవహారం మెల్లగా ఏపీ సీఎం జగన్ ప్రభుత్వానికి తలనొప్పి తెచ్చిపెడుతోంది. వీరితో బాటు ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీసు అధికారి ఎ. ధర్మారెడ్డి బదిలీ అంశం కూడా కోల్డ్ స్టోరేజీలోనే ఉంది. ఢిల్లీలో హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పని చేస్తున్న ఈయన.. తనను ఏపీకి ట్రాన్స్ ఫర్ చేయాలనికోరుతున్నారు. వీరి అభ్యర్థనలు ఇంకా పరిశీలనలో ఉన్నాయని, ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఢిల్లీవర్గాలు తెలిపాయి. మొదట వీరి సర్వీసు రూల్స్ ను పరిగణనలోకి తీసుకోవలసి ఉందని, డీపీఏటీ అధికారులు వీరికి గ్రీన్ సిగ్నల్ ఇఛ్చిన పక్షంలో దేశవ్యాప్తంగా ఇతర అధికారులు కూడా ఇలా కోరే అవకాశం ఉందని భయపడుతున్నారని ఈ వర్గాలు పేర్కొన్నాయి. వీరిలో చాలామంది ఇంటర్-కేడర్ డిప్యుటేషన్ పై వెళ్లగోరుతున్న విషయాన్ని ఈ వర్గాలు గుర్తు చేశాయి. 1999 బ్యాచ్ ఆఫీసర్ అయిన స్టీఫెన్ రవీంద్ర విషయంలో జగన్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిన అనంతరం ఈయనను ఇంటలిజెన్స్ చీఫ్ గా నియమిస్తారని వార్తలు వచ్చాయి.

తెలంగాణ కేడర్ కు చెందిన స్టీఫెన్ రవీంద్ర సెలవుకు దరఖాస్తు పెట్టి.. విజయవాడకు వెళ్లిపోయారు. మొదట ఈయన 15 రోజుల సెలవు పెట్టి.. దాన్ని మరో 30 రోజులకు పొడిగించుకున్నట్టు తెలిసింది. ఆయన 45 రోజుల సెలవు కాలం జులై 9 తో ముగుస్తుంది. బహుశా రవీంద్ర బదిలీ వ్యవహారం ఈ నెలలో తేలిపోవచ్చు. తెలంగాణ, ఏపీ లోని బ్యూరోక్రాట్లంతా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు.

కాగా.. 1988 బ్యాచ్ కు చెందిన శ్రీలక్ష్మి ప్రస్తుతం తెలంగాణాలో పబ్లిక్ ఎంటర్ ప్రయిసెస్ డిపార్ట్ మెంట్ లో ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేస్తున్నారు. ఆమె ఇదివరకే జగన్ ని కలిసి తన మొర విన్నవించుకోగా ఆయన సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. శ్రీలక్ష్మి ఇటీవల ఢిల్లీ వెళ్లి డీపీఏటీ అధికారులకు తన విషయం గుర్తు చేసినట్టు సమాచారం. అటు-ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ల కమిటీతో భేటీ అయినప్పుడు ఈ ముగ్గురు అధికారుల బదిలీ వ్యవహారంపై ఓ నిర్ణయం తీసుకోవచ్చునని అంటున్నారు.