‘ప్రజాదర్బార్’ రసాభాస.. సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద రచ్చరచ్చ..!
ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ‘ప్రజా దర్బార్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఏపీ మంత్రి వర్గ ఉపసంఘం దీన్ని ఆగష్టు 1కి వాయిదా వేసింది. దీంతో.. ఇది తెలియని ప్రజలు.. రాష్ట్రం నలుమూలల నుంచి సీఎం క్యాంపు కార్యాలయానికి భారీగా తరలివచ్చారు. అయితే.. ప్రజాదర్బార్ వాయిదా పడడంతో నిరాశతో వెనుదిరిగారు. ఒక్కసారిగా ప్రజలంతా ఇక్కడికి చేరుకోవడంతో స్వల్పంగా తొక్కిసలాట జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితి చక్కదిద్దారు. కాగా.. ఈరోజు […]

ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ‘ప్రజా దర్బార్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఏపీ మంత్రి వర్గ ఉపసంఘం దీన్ని ఆగష్టు 1కి వాయిదా వేసింది. దీంతో.. ఇది తెలియని ప్రజలు.. రాష్ట్రం నలుమూలల నుంచి సీఎం క్యాంపు కార్యాలయానికి భారీగా తరలివచ్చారు. అయితే.. ప్రజాదర్బార్ వాయిదా పడడంతో నిరాశతో వెనుదిరిగారు. ఒక్కసారిగా ప్రజలంతా ఇక్కడికి చేరుకోవడంతో స్వల్పంగా తొక్కిసలాట జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితి చక్కదిద్దారు.
కాగా.. ఈరోజు సీఎం జగన్.. వైసీపీ ఆధ్వర్యాన సీఎస్ఆర్ కల్యాణమండపంలో నిర్వహించిన సహస్ర చండీ యాగంలో పాల్గొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ యాగాన్ని జరిపించినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ యాగంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాల్గొన్నారు.