”మూడు రాజధానులపై రాష్ట్ర ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయం”
ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల అంశంపై కేంద్ర హోంశాఖ హైకోర్టులో అడిషనల్ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఏపీ రాజధానుల విషయంలో కేంద్రం పాత్రపై హోంశాఖ పూర్తి క్లారిటీ ఇచ్చింది.

Central Government Affidavit: ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల అంశంపై కేంద్ర హోంశాఖ హైకోర్టులో అడిషనల్ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఏపీ రాజధానుల విషయంలో కేంద్రం పాత్రపై హోంశాఖ పూర్తి క్లారిటీ ఇచ్చింది. రాజధాని లేదా రాజధానుల నిర్ణయంలో తమ జోక్యం ఉండబోదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది.
రాజధానికి అవసరమైన ఆర్ధిక సాయం చేస్తామని మాత్రమే చెప్పినట్లు వెల్లడించింది. అలాగే విభజన చట్టం ప్రకారం మూడు రాజధానులు తప్పులేదన్న కేంద్రం.. చట్టంలో ఒకే రాజధాని ఉండాలని ఎక్కడా కూడా లేదని తెలిపింది. కాగా, రాజధాని అంశంపై రాష్ట్ర ప్రభుత్వనిదే అంతిమ నిర్ణయమని కేంద్ర హోంశాఖ అఫిడవిట్‌లో స్పష్టం చేసింది.
Also Read:
విశాఖను భయపెడుతున్న కొత్త వైరస్.. జనాల్లో హడల్..




