అమెరికా వ్యోమనౌకకు కల్పనా చావ్లా పేరు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఎగసే అమెరికన్ కమర్షియల్ కార్గో వ్యోమ నౌకకు దివంగత భారత సంతతికి చెందిన వ్యోమగామి కల్పనా చావ్లా పేరు పెట్టారు. అంతరిక్షంలో 'అడుగు' పెట్టిన తొలి మహిళా తొలి మహిళా వ్యోమగామి ఆమె.

అమెరికా వ్యోమనౌకకు కల్పనా చావ్లా పేరు
Follow us

| Edited By: Team Veegam

Updated on: Sep 15, 2020 | 6:57 PM

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఎగసే అమెరికన్ కమర్షియల్ కార్గో వ్యోమ నౌకకు దివంగత భారత సంతతికి చెందిన వ్యోమగామి కల్పనా చావ్లా పేరు పెట్టారు. అంతరిక్షంలో ‘అడుగు’ పెట్టిన తొలి మహిళా తొలి మహిళా వ్యోమగామి ఆమె. అమెరికన్ వ్యోమ నౌకకు ఆమె పేరు పెడుతున్నట్టు అమెరికన్ గ్లోబల్ ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్ టెక్నాలజీ కంపెనీ ప్రకటించింది. 2003 లో స్పేస్ షటిల్ కొలంబియా మిషన్ లో ఆరుగురు క్రూ మేట్స్ సహా కల్పనా మరణించారు. ఆమె నాసా అంతరిక్ష విజ్ఞాన రంగంలో చరిత్ర సృష్టించారని, ఆమెను ఈ రకంగా గౌరవిస్తున్నామని ఈ కంపెనీ ట్వీట్ చేసింది. అంతరిక్ష కార్యక్రమాలకు ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొంది.