మంటల్లో సెల్‌టవర్.. భయాందోళనలో స్థానికులు!
రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని నస్సార్ స్కూల్ వద్ద సెల్‌టవర్‌లో మంటలు చెలరేగాయి. ఐడియా, ఎయిర్ టెల్ కు సంబంధించిన ఈ సెల్ టవర్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు సంభవించాయి. మంటలు భారీగా ఎగసిపడటంతో స్ధానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న రెండు ఫైర్ ఇంజన్‌లు మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటనలో ఆస్తి నష్టం మినహా ప్రాణనష్టం జరగలేదు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.