ట్రైనీ ఐపీఎస్‌ మహేశ్వర్‌రెడ్డి సస్పెన్షన్‌ చెల్లదన్న క్యాట్

ట్రైనీ ఐపీఎస్‌ మహేశ్వర్‌రెడ్డికి ఊరట లభించింది. ఆయనని సస్పెండ్‌ చేస్తూ కేంద్ర హోంశాఖ తీసుకున్న నిర్ణయాన్ని.. హైదరాబాద్‌లోని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యూనల్(క్యాట్) కొట్టిపారేసింది. మహేశ్వర్‌రెడ్డిని ప్రొబేషనరీ ట్రైనింగ్‌కు అనుమతించాలంటూ.. కేంద్ర ప్రభుత్వంతోపాటు.. జాతీయ పోలీస్‌ అకాడమీలను ఆదేశించింది. దీంతో మళ్లీ ఐపీఎస్ ట్రైనింగ్‌లో చేరేందుకు రూట్ క్లియర్ అయ్యింది. అక్టోబర్‌ 27న మహేశ్వర్ రెడ్డిపై.. తన భార్య భావన.. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని.. ఇప్పుడు మోసం చేసి.. […]

ట్రైనీ ఐపీఎస్‌ మహేశ్వర్‌రెడ్డి సస్పెన్షన్‌ చెల్లదన్న క్యాట్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 25, 2019 | 7:29 AM

ట్రైనీ ఐపీఎస్‌ మహేశ్వర్‌రెడ్డికి ఊరట లభించింది. ఆయనని సస్పెండ్‌ చేస్తూ కేంద్ర హోంశాఖ తీసుకున్న నిర్ణయాన్ని.. హైదరాబాద్‌లోని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యూనల్(క్యాట్) కొట్టిపారేసింది. మహేశ్వర్‌రెడ్డిని ప్రొబేషనరీ ట్రైనింగ్‌కు అనుమతించాలంటూ.. కేంద్ర ప్రభుత్వంతోపాటు.. జాతీయ పోలీస్‌ అకాడమీలను ఆదేశించింది. దీంతో మళ్లీ ఐపీఎస్ ట్రైనింగ్‌లో చేరేందుకు రూట్ క్లియర్ అయ్యింది.

అక్టోబర్‌ 27న మహేశ్వర్ రెడ్డిపై.. తన భార్య భావన.. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని.. ఇప్పుడు మోసం చేసి.. మరో వివాహానికి సిద్ధమవుతున్నాడంటూ.. ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు ట్రైనీ ఐపీఎస్ మహేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు చేసి.. విషయాన్ని కేంద్ర హోంశాఖకు తెలియజేశారు. దీంతో ట్రైనింగ్ నుంచి మహేశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మహేశ్వర్ రెడ్డి క్యాట్‌ను ఆశ్రయించడంతో.. కేంద్ర హోంశాఖ విధించిన సస్పెన్షన్‌ను సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యూనల్ (క్యాట్) రద్దుచేసింది.