గోదావరి బోటు ప్రమాదం: ప్రాణాలు కాపాడిన స్థానికులకు నగదు పురస్కారం!

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద బోటు ప్రమాదంలో 26 మంది ప్రాణాలు కాపాడిన స్థానికులకు ఒక్కొక్కరికీ రూ.25 వేల చొప్పున ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారని మంత్రి కన్నబాబు వెల్లడించారు. కాగా ఈ ప్రమాద ఘటనలో గల్లంతైన 14 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని మంత్రి తెలిపారు. బోటును వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నామని..ఘటనాస్థలిలో ప్రతికూల పరిస్థితుల కారణంగానే బోటు వెలికితీత ఆలస్యమవుతోందని తెలిపారు. ఈ ఘటనలో మరోవైపు బోటును తీస్తామని కొందరు ప్రైవేట్‌ వ్యక్తులు వస్తున్నారని..సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని మంత్రి […]

గోదావరి బోటు ప్రమాదం: ప్రాణాలు కాపాడిన స్థానికులకు నగదు పురస్కారం!
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 27, 2019 | 9:30 PM

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద బోటు ప్రమాదంలో 26 మంది ప్రాణాలు కాపాడిన స్థానికులకు ఒక్కొక్కరికీ రూ.25 వేల చొప్పున ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారని మంత్రి కన్నబాబు వెల్లడించారు. కాగా ఈ ప్రమాద ఘటనలో గల్లంతైన 14 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని మంత్రి తెలిపారు. బోటును వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నామని..ఘటనాస్థలిలో ప్రతికూల పరిస్థితుల కారణంగానే బోటు వెలికితీత ఆలస్యమవుతోందని తెలిపారు. ఈ ఘటనలో మరోవైపు బోటును తీస్తామని కొందరు ప్రైవేట్‌ వ్యక్తులు వస్తున్నారని..సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని మంత్రి వెల్లడించారు.

మరో ప్రమాదం చోటు చేసుకోకూడదనే ఆచితూచి అడుగులు వేస్తున్నామన్నారు. ఇలాంటి ప్రమాదాలు మరోసారి జరగకుండా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఉన్నతస్థాయి కమిటీతోపాటు మెజిస్టీరియల్ విచారణ సైతం జరుగుతోందని చెప్పారు. ఆచూకీ లేని వారి కుటుంబాలకు మరణ ధ్రువపత్రం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమని స్పష్టం చేశారు. బోటు ప్రయాణాలపై మాన్యువల్ రూపొందించాలని సీఎం ఆదేశించారని…బోట్లలో జీపీఎస్, నేవిగేషన్ వ్యవస్థ ఉంటేనే అనుమతి ఇచ్చే యోచన ఉందని తెలిపారు.