బాలీవుడ్ డ్రగ్స్‌ డొంక కదులుతోంది….

బాలీవుడ్ డ్రగ్స్‌ డొంక కదులుతోంది....

డ్రగ్స్‌ కేసులో- బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌పై ఎన్సీబీ గురిపడింది. ముంబైలోని బాంద్రాలో గల అర్జున్‌ రాంపాల్‌ ఇంట్లో అధికారులు సోదాలు చేశారు. ఈ డ్రగ్స్‌ కేసులో ఆయన గాళ్‌ఫ్రెండ్‌ గాబ్రియెలా పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈనెల 11న విచారణకు రావాలంటూ...

Sanjay Kasula

|

Nov 09, 2020 | 10:44 PM

సుశాంత్‌ మృతితో ముంబైలో మొదలైన డ్రగ్స్‌ కేసు దర్యాప్తు బాలీవుడ్‌ను షేక్‌ చేస్తోంది. డ్రగ్స్‌ పెడ్లర్స్‌ అందించిన సమాచారం ఆధారంగా పక్కా ఆధారాలతో ప్రముఖుల చేతికి బేడీలు వేసే పనిలో ఉంది నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో.

డ్రగ్స్‌ కేసులో- బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌పై ఎన్సీబీ గురిపడింది. ముంబైలోని బాంద్రాలో గల అర్జున్‌ రాంపాల్‌ ఇంట్లో అధికారులు సోదాలు చేశారు. ఈ డ్రగ్స్‌ కేసులో ఆయన గాళ్‌ఫ్రెండ్‌ గాబ్రియెలా పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈనెల 11న విచారణకు రావాలంటూ వీరిద్దరికీ ఎన్సీబీ సమన్లు జారీచేసింది. వీళ్లిద్దరినీ విచారణకు పిలవడానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి.

గాబ్రియెలా సోదరుడు అజిసిలావోస్‌ డెమిట్రియేడ్స్‌ను ఎన్సీబీ అరెస్టు చేసింది. ఇతడిపై డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ ఆరోపణలు ఉన్నాయి. అంతేగాదు, అర్జున్‌ రాంపాల్‌ డ్రైవర్లలో ఒకరిని డ్రగ్స్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో 11వ తేదీన అర్జున్‌ రాంపాల్‌ దంపతులను కేవలం ప్రశ్నించి వదిలేస్తారా? లేక అరెస్ట్ చేస్తారా అన్నది హాట్ టాపిక్‌ అయింది.

అంతకుముందు- ఆదివారం నాడు నిర్మాత ఫిరోజ్‌ నడియావాలా ఇంటిపై నార్కోట్రిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు దాడి చేశారు. ఆయన ఇంట్లో 10 గ్రాముల మరిజువానా పట్టుబడింది. నడియావాలా భార్య షబానా సయాద్‌ డ్రగ్స్‌ సేవిస్తున్నట్లు ఎన్సీబీకు పక్కా ఆధారాలు లభించాయి. దీంతో- వెంటనే షబానా సయీద్‌ను అరెస్టు చేశారు. తాజాగా కోర్టు ఆమెకు ఈనెల 23 వరకు జ్యుడీషియల్‌ కస్టడీకి పంపించారు. వెంటనే షబానా సయీద్‌ను బైకుల్లా జైలుకు పంపించారు.

బాలీవుడ్‌ డ్రగ్స్‌ డొంకను కదిలించే పనిలో ఉంది ఎన్సీబీ. ఇందులో భాగంగానే బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకోన్‌ మాజీ మేనేజర్‌ కరిష్మా ప్రకాష్‌పై గురిపెట్టింది. కరిష్మా ప్రకాష్‌ని ఇదివరకే ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు. మంగళవారం, అంటే పదో తేదీన రారమ్మంటూ ఎన్సీబీ ఆమెకు నోటీసులు ఇచ్చింది.

అర్జున్‌ రాంపాల్‌, ఆయన గాళ్‌ఫ్రెండ్‌, నిర్మాత ఫిరోజ్‌, దీపిక మాజీ మేనేజర్‌ కరిష్మా ప్రకాష్‌.. ఇలా.. బాలీవుడ్‌లో మత్తులో మునిగితేలే సెలబ్రిటీల భరతం పడతామంటోంది నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో. ఇకముందు ఎవరి పేర్లు వస్తాయన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌ అయింది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu